twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా సమస్యలు ఎదుర్కొన్నాం: నితిన్, గౌతం మీనన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఘర్ణణ, ఏ మాయ చేసావే చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. గౌతం మీనన్ మీనన్ సమర్పణలో గురు పిలింస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మల్టీ డైమన్షన్ ఎంటర్టెన్మెంట్స్ అసోసియేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్'. నితిన్, యామీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు. వెంకట్ సోమసుందరమ్, రేష్మ ఘటాల, సునీత తాటి నిర్మాతలు.

    కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ అఖిల్ విడుదల చేయగా, ఆడియో సీడీలను నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి విడుదల చేసారు.

    ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదలవుతోంది. సినిమా నిర్మాణ సమయంలో కొన్ని చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంటాయి. నేను కూడా ఇష్క్ సినిమా ముందు వరకు సమస్యలు పేస్ చేసాను. ఈ సినిమా కోసం గౌతం మీనన్, రేష్మ చాలా సమస్యలు ఫేస్ చేసారు. ఎక్కడ అధైర్యపడకుండా ముందుకెళ్లారు. సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రాని డిఫరెంట్ పాయింటుతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుది అన్నారు.

    గౌతం మీనన్

    గౌతం మీనన్

    గౌతం మీనన్ మాట్లాడుతూ... నేను తెలుగులో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. అన్ని సినిమాల్లాగానే ఈ సినిమాకి కూడా కష్టాలు వచ్చాయి. అన్నింటినీ దాటి ఇపుడు మీ ముందుకు వస్తున్నాం. కార్తీక్ మూడు సాంగ్స్, అనూప్ ఒక సాంగ్స్ ఇచ్చారు. సందీప్ చౌతా బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నితిన్ సపోర్టు మరచిపోలేం..అతని కెరీర్లో మంచి సినిమా అవుతుందన్నారు.

    దర్శకుడు ప్రేమ్ సాయి

    దర్శకుడు ప్రేమ్ సాయి

    దర్శకుడు ప్రేమ్ సాయి మాట్లాడుతూ ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నితిన్ తో కలిసి పని చేయడం మంచి ఎక్స్ పీరియన్స్...సినిమాకు సపోర్టుగా ఉన్న అందరికీ థాంక్స్ అన్నారు.

    అఖిల్ మాట్లాడుతూ..

    అఖిల్ మాట్లాడుతూ..

    గౌతమ్ మీనన్ సినిమాలు చాలా డిపరెంటుగా ఉంటాయి. తెలుగులో తొలిసారి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కూడా కథ బావుంటుందని నమ్మకం ఉంది. ఈ సినిమా విషయంలో నితిన్ పాజిటివ్ గా ఉన్నారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

    నటీనటులు

    నటీనటులు

    నితిన్, యామీ గౌతమ్, అశుతోష్ రానా, నాజర్, సత్యం రాజేష్, సప్తగిరి, హర్షవర్ధన్, సురేఖా వాణి, రవి ప్రకాష్, ఇంటూరి వాసు నటించారు. మ్యూజిక్: కార్తీక్, అనూప్ రూబెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: సత్య పొన్ మార్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రాజీవన్, యాక్షన్: విజయ్, డైలాగ్స్: కోన వెంకట్, రచనా సహకారం: హర్షవర్ధన్, సాహిత్యం: సాహితి, భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, నిర్మాతలు: వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రేమ్ సాయి.

    English summary
    Courier Boy Kalyan Movie Audio Launch event held at Hyderabad. Actor Nitin, Director Premsai, Gautham Menon, Venkat Somasundaram, Reshma Ghatala, Nani, Rana Daggubati, Naga Chaitanya, Akhil Akkineni, Anasuya and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X