»   » ‘మా’ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

‘మా’ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్'(MAA) ఎన్నికలకు కోర్టు గ్రీన్ సింగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి తీర్పు వెల్లడించే వరకు ఫలితాలు వెల్లడించరాదని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో సినీ వర్గాల్లో ఉత్కంఠకు తెర పడినట్లయింది.

మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్ (మా)కు జరుగనున్న ఎన్నికలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేశారు.

Court green singal to MAA election

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమలోని నటులు రెండు వర్గాలుగా చీలి పోయారు. కొందరు ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ఇస్తుండగా, మరికొందరు జయసుధకు మద్దతు ఇస్తున్నారు.

మీడియా సమావేశాలు ఏర్పాటు ఇటు జయసుధ వర్గం, అటు రాజేంద్ర ప్రసాద్ వర్గం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఈ ఎన్నికల విషయం హాట్ టాపిక్ అయింది. జయసుధ ప్యానెల్ ను..... వెనక నుండి దాసరి వర్గం నడిపిస్తుందని, రాజేంద్రప్రసాద్ ప్యానెల్ ని వెనక నుండి చిరంజీవి వర్గం నడిపిస్తుందనే ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి.

English summary
Hyderabad Court green singal to Movie Artist Association election.
Please Wait while comments are loading...