»   » అతన్ని రెండురోజుల్లో అరెస్ట్ చేయండీ: హీరో పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

అతన్ని రెండురోజుల్లో అరెస్ట్ చేయండీ: హీరో పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్యనే మందవల్లి నుంచి ప్రయాణిస్తున్న 'ఆడి' కారు అడయార్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారును జై డ్రైవ్ చేస్తున్నాడు, ప్రేమ్‌జీ కూడా అతనితో అదే కారులో ఉన్నాడు. బ్రిడ్జి గోడను ఢీకొట్టిన కారు కొంతదూరం ప్రయాణించి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి నటులు ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఆసమయం లో ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవటం, కారుని సరైన సమయం లో అదుపు చేయటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.

"కారు దెబ్బతిన్న పరిస్తితిని చూస్తే మాత్రం ఈ ఇద్దరూ ఎంతటి ప్రమాదం నుంచి బయటపడ్డారో అర్థమైపోతోంది, నిజానికి ఆ సమయం లో వారు సరైన స్థితిలో లేరు" అంటూ అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు.

Court issues arrest warrant against actor Jai

ఈ కేసుపై సైదాపేట కోర్టులో విచారణ జరుగుతోంది. రెండు సార్లు విచారణ జరుగగా జై కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై న్యాయమూర్తి అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో జైని అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం ఈ కేసును వచ్చేవారానికి వాయిదా వేశారు.

అరెస్టు వారంట్ పట్టుకున్న పోలీసులు, పరారీలో ఉన్న జై కోసం గాలింపు చేపట్టారు. కాగా, తెలుగు హీరోయిన్ అంజలిని జై వివాహం చేసుకోనున్నాడంటూ కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 'జర్నీ' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

English summary
Magistrate L Abraham Lincoln of Saidapet Court has issued a non-bailable arrest warrant against actor Jai after the actor failed to appear in a drunken driving case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu