»   » కోర్టుకు రావాల్సిందే: హీరో మహేష్ బాబుకు సమన్లు!

కోర్టుకు రావాల్సిందే: హీరో మహేష్ బాబుకు సమన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తన నవలను కాపీ కొట్టి 'శ్రీమంతుడు' చిత్రాన్ని తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మహేష్ బాబుతో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడు కొరటాల శివకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

2012 సంవత్సరంలో తాను రాసిన 'చచ్చేంత' ప్రేమ అనే నవలను ప్రఖ్యాత మాసపత్రిక 'స్వాతి' ప్రత్యేక సంచిక ద్వారా ప్రచురించిందని, ఆ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అయిందని రచయిత ఆరోపించారు.


పోరాటం చేసినా న్యాయం జరుగలేదు

పోరాటం చేసినా న్యాయం జరుగలేదు

తనకు జరిగిన అన్యాయం గురించి కొన్ని నెలలుగా తమిళంతో పాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను కలిసినా నా గోడు పట్టించుకోలేదని రచయిత ఆరోపిస్తున్నారు.


డబ్బు కోసం కాదు, న్యాయం కోసం

డబ్బు కోసం కాదు, న్యాయం కోసం

కేవలం డబ్బులు ఆశించి ఫిర్యాదు చేయడం లేదని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగాలనే ఉద్దేశంతో తాను కోర్టు కెక్కినట్లు రచయిత తెలిపారు.


ఇన్నాళ్లు ఏమైనట్లు?

ఇన్నాళ్లు ఏమైనట్లు?

సినిమా రిలీజైన ఇంత కాలానికి కోర్టు కెక్కడంపై రచయి తస్పందిస్తూ...వ్యక్తిగత పనిమీద కొంతకాలం కేరళలో వుండాల్సి వచ్చింది. అందుకే ఇంతకాలం జాప్యం జరిగిందని రచయిత వెల్లడించారు.


మహేష్ బాబు అండ్ శ్రీమంతుడు టీం ఏం చేయబోతున్నారు?

మహేష్ బాబు అండ్ శ్రీమంతుడు టీం ఏం చేయబోతున్నారు?

శ్రీమంతుడు సినిమా ద్వారా నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామ్యం అయ్యారు. మరి ఈ కేసు విషయంలో మహేష్ బాబు అండ్ శ్రీమంతుడు టీం ఏం చేయబోతున్నారు, మార్చి 3న మహేష్ బాబు కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.


English summary
Nampally court has issued summons to actor Mahesh Babu, Koratala Siva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu