twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చట్ట వ్యతిరేకంగా...సొనాలి బింద్రే, టబు, కేసు

    By Srikanya
    |

    జోధ్‌పూర్‌: బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, సొనాలి బింద్రే, టబు, నీలంలపై 14 ఏళ్ల కిత్రం కృష్ణ జింకను వేటాడినట్లు శనివారం తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. వారిపై వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్‌ 9/51, 9/52, ఐపీసీ 149 ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్లు జోధ్‌పూర్‌లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ చంద్రకళ జైన్‌ తెలిపారు. అయితే తమపై వచ్చిన అభియోగాలను నటులు కొట్టిపారేస్తున్నారు.

    బాలీవుడ్‌ నటీ నటులు సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లపై వన్యప్రాణి చట్టం కింద చార్జ్‌షీట్‌ దాఖలైంది. 14 సంవత్స రాల క్రితం వీరు ఐదుగురూ కృష్ణజింకలను వేటాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు శనివారం నాడు చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. వచ్చే నెల నుంచి విచారణ ప్రారంభం కానుంది. విచారణ అనంతరం నేరం రుజువైతే వీరికి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు వెల్లడించారు.

    సల్మాన్‌ఖాన్‌పై గతంలో వాడిన ఆయుధ చట్టాన్ని ఈ చార్జ్‌షీట్‌లో ఉపసంహరిం చుకున్నారు. సైఫ్‌ అలీ, తబు, నీలమ్‌, సోనాలీలపై వేటకు ప్రోత్సహించిన నేరాన్ని, చట్ట వ్యతిరేకంగా అడవుల్లో సమావేశమైన నేరాన్ని మోపారు. చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ చంద్రకళా జైన్‌ వీరిపై వున్న ఆరోపణలను చదివారు. వన్యప్రాణి రక్షణ చట్టం,సెక్షన్‌ 9/51, 9/52, ఐపీసీ సెక్షన్‌ 149 కింద వీరిపై ఆరోపణలు వున్నట్టు వెల్లడించారు.

    తదుపరి విచారణను ఏప్రిల్‌ 27కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తమపై న్యాయమూర్తి చదివిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్టు నటీ నటులు తెలిపారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా కోర్టుకు హాజరు కావాల్సి వున్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేక పోయారని సల్మాన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. 1998 అక్టోబర్‌ 1, 2 తేదీల్లో జోధ్‌పూర్‌ సమీపంలోని కంకణి గ్రామంలో వీరంతా కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడారని ఆరోపణ. హమ్‌ సాథ్‌ సాథ్‌ హై (తెలుగులో ప్రేమానురాగం) చిత్రం షూటింగ్‌ సమయంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణజింకలను వేటాడటం, చంపడం భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షింపదగ్గ నేరం.

    English summary
    A court in Jodhpur on Saturday framed revised charges against actors Saif Ali Khan, Tabu, Neelam Kothari and Sonali Bendre in a 14-year-old case of poaching two blackbucks. All the actors, who were present in court, denied the charges and pled innocent. Bollywood star Salman Khan could not appear before the court citing heath grounds and was exempted from personal appearance after his lawyers filed a plea saying he was in the US for treatment. The court of the chief judicial magistrate [rural] read out the fresh charges under Sections 9/51 and 9/52 of the Wildlife Protection Act and IPC Sec. 149 and posted the case for its next hearing on April 27.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X