»   » బాలీవుడ్ నటి ప్రీతిజింటాకు కోర్టు నోటీస్

బాలీవుడ్ నటి ప్రీతిజింటాకు కోర్టు నోటీస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రీతిజింటాకు చండీఘర్ స్థానిక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు యజమాని అయిన ప్రీతి ఐపీఎల్‌ ప్రచార ప్రకటనల్లో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు వినియోగించింది. దానికి అభ్యంతరం చెబుతూ ఓ స్వచ్ఛంద సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో అడిషనల్‌ ఛీప్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ అన్షూల్‌ బెర్రీ ప్రీతిజింటా, సహ యజమాని నెస్‌ వాడియాలను ఏప్రిల్‌ 2న హాజరుకావాలని ఆదేశించింది. వ్యాపార ప్రకటనల్లో భగత్‌సింగ్‌, రాజ్‌గురుతో పాటు ఇతర స్వాతంత్య్ర యోధుల చిత్రాలు వినియోగించడం ద్వారా వారు ప్రజల మనోభావాలను గాయపరిచారని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. అయితే ఈ వివాదంపై ప్రీతిజింటా ఇదివరకే కొన్ని దినపత్రికల ద్వారా క్షమాపణ కోరారు. మరి కోర్టు మందలించి వదిలేస్తుందా లేక ఏ నిర్ణయం తీసుకుంటుందా అని అంతటా చర్చ జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu