»   »  సినీ రచయిత కులశేఖర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష

సినీ రచయిత కులశేఖర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Court sentences Lyricist kulasekhar to 6 months jail
హైదరాబాద్ : దొంగతనం కేసులో సినీ రచయిత కులశేఖర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్.సన్యాసినాయుడు తీర్పు చెప్పారు. వెండికిరీటాన్ని దొంగిలించాడనే కేసుపై ఆయన్ని ఆరెస్టు చేసి కోర్టుకు తీసుకు వచ్చారు. నేరం రుజువు కావటంతో శిక్ష విధించారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సినిమా కథలు, పాటలు రాసే హైదరాబాద్‌కు చెందిన టి.పి.కులశేఖర్.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న త్రిపురసుందరి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని దొంగిలించాడు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.

పాటల రచయితగా అతి తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న కులశేఖర్ ఓ ఐదేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో భాధ పడ్డారు. మెదడుకి సంభందించి వ్యాధితో భాధ పడుతున్న ఆయన ఆమధ్య కోమాలోకి కూడా వెళ్ళారని చెప్పుకున్నారు. కొంతకాలం ఎవరిని గుర్తించలేని స్ధితిలో ఉన్నారు. అయితే నిపుణలైన డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నారు.

ఇక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కులశేఖర్ ..తేజ,ఆర్.పి.పట్నాయిక్ కాంబినేషన్ లో వరస హిట్ సాంగ్స్ రాసారు. ఇప్పటికి నువ్వు-నేను సినిమాలో ఆయన రాసిన పాటలు ఎక్కడో చోట వినపడుతూనే ఉంటాయి. అలాగే ఆయన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ రాసా ప్రేమ లేఖరాసా అంటూ ..ఓ ప్రేమ కథను డైరక్ట్ చేసారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందింది. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ లో కూడా పోగ్రామ్ కి వ్యాఖ్యాతగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. అయితే కులశేఖర్..గతంలోనూ సెల్ పోన్ వంటి దొంగతనాలు చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినపడింది.

English summary

 Kakinada court here has sentenced Lyricist kulashekar to six months imprisonment in theft case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu