twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆటోనగర్‌ సూర్య' రిలీజ్ పై కోర్టు స్టే

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆటోనగర్‌ సూర్య సినిమాను ఈనెల 18 వరకు విడుదల చేయకూడదని గుంటూరు జిల్లా నాలుగో అదనపు న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ గురువారం ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమా నిర్వాహకుడు పంపిణీ హక్కుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని గుంటూరుకు చెందిన ఎమ్మరాల్డ్‌ ప్రాజెక్టు యజమాని షేక్‌ అబ్దుల్‌ మహమూద్‌ ఈనెల 5న గుంటూరు జిల్లా నాలుగో న్యాయస్థానంలో దావా వేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.

    చిత్ర నిర్వాహకుడైన ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ జక్కా వెంకట ఫణీంద్రరెడ్డికి మహమూద్‌ రూ.2.08 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సినిమా పంపిణీ హక్కులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని మహమూద్‌ తరఫున న్యాయవాది శాంతకుమార్‌ మీడియాతో చెప్పారు. ఆమేర ఒప్పందానికి కట్టుబడకుండా ఉల్లంఘనకు పాల్పడినందుకు అతనిపై దావా వేసినట్లు వివరించారు.

    Court stay on autonagar surya release

    నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో దేవా కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య' . మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 22 కోట్లు అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఎంత బిజినెస్ అయినా దాన్ని రీచ్ అవటం కష్టమంటున్నారు.

    అచ్చిరెడ్డి చిత్రం గురించి మాట్లాడుతూ 'మా సినిమాలో రీరికార్డింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే సంగీత దర్శకుడు అనూప్ బాగా టైమ్ తీసుకుని అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. రీరికార్డింగ్ పూర్తి కాగానే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తాం. ఈ చిత్రంలో నాగచైతన్య క్లాస్ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో మరో హిట్ మూవీ అవుతుంది. అలాగే 'ప్రేమ కావాలి', 'పూలరంగడు' చిత్రాల తరువాత మా బేనర్‌కి 'ఆటోనగర్ సూర్య' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

    విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    Naga Chaitanya ‘Autonagar Surya’ release troubles aren't dying down and they may not end in near future. The Deva Katta directorial release has been long delayed. Now, a financier approached Guntur Magistrate court stating that producers are making him suffer without paying back the finance taken in the form of loan during production. So, court ordered the producers to pay the debts in order to release Autonagar Surya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X