»   » సచిన్ నిర్ణయంతో షాకైన షారుక్

సచిన్ నిర్ణయంతో షాకైన షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇప్పటికే వన్డేలకు గుడ్ బై చెప్పిన ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత తన టెస్టులకూ దూరం కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సచిన్ నిర్ణక్ష్ంతో చాలా అభిమానులు నిరశలో కూరుకు పోయారు. సచిన్ అభిమానుల్లో ఒకరైన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌ది కూడా అదే పరిస్థితి.

సచిన్ వల్లనే నేను క్రికెట్‌కు అడిక్ట్ అయ్యాను...ఆయన లేని క్రికెట్ సహింపదు అంటూ సోషల్ నెట్వర్కింగులో ట్వీట్ చేసారు. సచిన్, షారుక్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఇద్దరూ ఒకరికొకరు అభిమానులే. సచిన్ నిర్ణయం షారుక్‌ను కాస్త హర్ట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

రెండువందల టెస్టును ఆడిన అనంతరం మాస్టర్ టెస్టులకూ దూరం కానున్నారు. ఇప్పటికే టెండుల్కర్ అంతర్జాతీయ వన్డే, ట్వంటీ20లకు గుడ్ బై చెప్పారు. తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, కోల్‌కతలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టెస్టుల అనంతరం సచిన్ తప్పుకోనున్నారు.

క్రికెట్ లేని జీవితాన్ని తాను ఊహించుకోలేనని సచిన్ టెండుల్కర్ బిసిసిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. క్రికెట్ లేకుండా జీవించడం దుర్భరమే అన్నాడు. తాను 11వ ఏట నుండి క్రికెట్ ఆడుతున్నానని, దేశం తరఫున ఆడటం తన కల అని అది నెరవేరిందన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు.

English summary
"O no! Suddenly realized the meaning of addiction. Mine was the Master. I am going thru cold turkey. To see cricket without Sachin? Unbearable," SRK saying.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu