»   » క్రికెట్ సమరం ముగియగానే సినిమా సంబరం మొదలు...!

క్రికెట్ సమరం ముగియగానే సినిమా సంబరం మొదలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెట్ సమరం ముగియగానే సినిమా సంబరం మొదలు కానుంది. తెలుగులో భారీ చిత్రాల విడుదలకి క్రికెట్ కారణంగా బ్రేకులు పడిపోగా, ఏప్రిల్ లో వాటి జోరు మొదలవుతుంది. జూ ఎన్టీఆర్ నటిస్తున్న శక్తి సినిమాతో సినిమా సంబరాలకి రిబ్బన్ కటింగ్ జరుగుతుంది. అత్యంత భారీ లెవల్లో, కనీ వినీ ఎరుగని రీతిలో విడుదల కానున్న ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ 'తీన్ మార్" కూడా ఏప్రిల్ రేసులో నిలిచింది. ఈ రెండు చిత్రాలకీ నడుమ ప్రభాస్ నటిస్తున్న 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" విడుదలవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రభాస్ సరసన కాజల్, తాప్సీ నటిస్తున్న ఈ చిత్రం కూడా 'డార్లింగ్"లానే ఫ్యామిలీస్, యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఇంతదాకా కనిపించని ఒక కొత్త గెటప్ లో కనిపించి యూత్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆసక్తికరమైన పోటీలో ఎవరు నెంబర్ వన్ హిట్ ఇస్తారో చూడాలని తెలుగు సినీ ప్రియులు చాలా ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. జూ ఎన్టీఆర్ శక్తి చూసిస్తాడా, పవన్ తీన్ మార్ ఆడిస్తాడా లేక ప్రభాస్ తానొక్కడే మిస్టర్ పర్ ఫెక్ట్ అనిపిస్తాడా వేచి చూడాల్సిందే...

English summary
Cricket World cup effect on Tollywood ...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu