»   »  సినీ డైరక్టర్ తేజపై క్రిమినల్ కేసు, క్రిమినల్ గ్యాంగ్ లతో కలిసి

సినీ డైరక్టర్ తేజపై క్రిమినల్ కేసు, క్రిమినల్ గ్యాంగ్ లతో కలిసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ దర్శకుడు తేజ మరో వివాదంలో ఎదుర్కొన్నారు. తేజ, వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ కలప వ్యాపారి ఆర్‌వి.కృష్ణారావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.... ఫిలింనగర్ రోడ్ నెం.9లో నివసించే ఆర్‌వి.కృష్ణారావు టింబర్ బిజినెస్ చేస్తున్నారు.ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని ముక్తిధామం సాయిబాబా దేవాలయం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు వెళ్తుండగా విక్కి అనే వ్యక్తి కారు ఆపి ఆయనను కలుసుకొని వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ నీపై దృష్టి పెట్టాయని సినిమా దర్శకుడు తేజ ఇంటి విషయాన్ని సెటిల్ చేసుకోవాలని సూచించారు.

Criminal case on Director Teja

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ ఇంటి విషయాన్ని త్వరగా తేల్చుకోకపోతే వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగ్ చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన సినీ డెరైక్టర్ తేజ ఇదే విషయంపై కృష్ణారావుకు ఫోన్ చేసి దూషించాడు.

తనకు ఈ ముగ్గురి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు న్యాయ సలహా కోసం ఫిర్యాదును కోర్టుకు పంపించారు. కోర్టు ఆదేశాలతో శనివారం రాత్రి ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Director Teja faced few controversies over house grabbing etc and now the courts have struck off the cases. Now another criminal case is filed by RV Krishna Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu