»   » ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్: శృతీహసన్ కెరీర్ కి ఇది దారుణమైన దెబ్బ

ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్: శృతీహసన్ కెరీర్ కి ఇది దారుణమైన దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ కిడ్ అయినంత మాత్రాన శృతీ హసన్ కెరీర్ ఏం సాఫీగా సాగిపోలేదు. కట్తగట్టుకొచ్చి ఆఫర్లు పడిపోలేదు. మొదట్లోనే దారుణమైన ఫెయిల్యూర్స్ ని చూసింది తాను. ఇక టాలీవుడ్ లో అయితే ఏకంగా "ఐరన్ లెగ్" అనిపించుకుంది. చేసిన సినిమా చేసినట్టు అట్టర్ ఫ్లాప్ అయిపోతూంటే కూడా నిరాసలో పడిపోకుండా ప్రయత్నిస్తూనే వచ్చింది. తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారింది శృతి తానేమిటో నిరూపించుకుంది.

 కష్టకాలం వచ్చినట్లు ఉంది

కష్టకాలం వచ్చినట్లు ఉంది

గబ్బర్ సింగ్, రేసు గుర్రం, ఇలా వరుస హిట్ లతో టాలీవుడ్ లో నిలబడింది... అయితే మళ్ళీ ఏమయ్యిందో గానీ తొలినాళ్ళ పరిస్థితిలోనే పడిపోయింది శృతీ... కెరీర్ మొదటిలో హిట్లు లేకపోయినా తన అందంతో అందరినీ కట్టిపడేసింది. కాని మళ్ళీ ఇప్పుడు శృతికి కష్టకాలం వచ్చినట్లు ఉంది. ఏ సినిమా చేసినా తనను మాత్రమే స్పెషల్ గా వేలెత్తి చూపిస్తున్నారు.

బెహన్‌ హోగీ తేరీ

బెహన్‌ హోగీ తేరీ

శృతిహాసన్‌కి కొద్ది కాలంగా ఏది చేసినా కలిసి రావడం లేదు. ఇప్పటికే కెరియర్‌ ఇబ్బందుల్లో పడింది. చేతిలో సినిమాలు లేని పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలవుతోన్న 'బెహన్‌ హోగీ తేరీ' చిత్రంపై శృతి చాలా ఆశలు పెట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందనే నమ్మకం తో ఉంది కానీ ఇప్పుడా అంచనాలు గల్లంతయ్యాయి.

ఫెయిల్యూర్‌ తప్పదని

ఫెయిల్యూర్‌ తప్పదని

అంతగా పేరు లేని నటుడు రాజ్‌ కుమార్‌ రావుతో శృతి జంటగా నటించిన ఈ కామెడీ చిత్రం ట్రెయిలర్స్‌ ఆకర్షణీయంగానే అనిపించాయి. అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్‌ నుంచి వస్తోన్న రివ్యూలు మరోసారి శృతిహాసన్‌కి ఫెయిల్యూర్‌ తప్పదని ఘోషిస్తున్నాయి. దారుణం ఏమిటంటే ఈ ఫెయిల్యూర్ మరకని కూడా శృతీనే భరించాల్సి రావటం.

దారుణంగా ట్రోలింగ్‌కి గురయింది

దారుణంగా ట్రోలింగ్‌కి గురయింది

ఫ్లాప్‌ కంటే కూడా ఈ రివ్యూల్లో అందరూ ముక్తకంఠంతో శృతిహాసన్‌ని మైనస్‌ పాయింట్‌గా చెబుతున్నారు. ఈమధ్య శృతి ఏ చిత్రంలో నటించినా ఈ ఫీడ్‌బ్యాక్‌ కామన్‌ అయిపోయింది. ప్రేమమ్‌, కాటమరాయుడు చిత్రాలకి ఆమె దారుణంగా ట్రోలింగ్‌కి గురయింది. తాజాగా 'బెహన్‌ హోగీ తేరీ' చిత్రంలో రావు అద్భుతంగా నటించాడని, కానీ అతడికి సరయిన జోడీని పెట్టి వుండాల్సిందని, ఆమె వల్ల ఈ చిత్రం మరింత విసిగించిందని విమర్శకులు రాస్తున్నారు.

తనే మైనస్‌ అని ముద్ర

తనే మైనస్‌ అని ముద్ర

రిలీజ్‌కి ముందు అంత చిన్న హీరోతో నటిస్తున్నావేంటంటూ శృతిహాసన్‌ని అడిగిన వాళ్లే ఇప్పుడు ఈ చిత్రానికి తనే మైనస్‌ అని ముద్ర వేసేస్తున్నారు. ఒక టైమ్‌లో రాణిలా వెలిగిపోయిన శృతి సడన్‌గా ఇలా క్రేజ్‌ కోల్పోవడమే కాకుండా విమర్శల పాలవడమేమిటో, టైమ్‌ బ్యాడ్‌ కాకపోతే.

English summary
Shruti Haasan received poor reviews for her performance in the new release 'Behen Hogi Teri'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu