»   » ఓ వైపు రివ్యూలపై వివాదం: ‘స్పైడర్’ మూవీపై క్రిటిక్స్ రిపోర్ట్స్ ఇలా..

ఓ వైపు రివ్యూలపై వివాదం: ‘స్పైడర్’ మూవీపై క్రిటిక్స్ రిపోర్ట్స్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘స్పైడర్’పై క్రిటిక్స్ రిపోర్ట్స్ : రివ్యూలపై వివాదం : SPYder movie critic reports

రెండు మూడు రోజులుగా సినీ క్రిటిక్స్, వారు రాసే సినిమా రివ్యూల మీద రకరకాల చర్చ జరుగుతున్న సంగతి. తన సినిమాలోని లోపాలను ఎత్తి చూపడం కొందరు హీరోలకు నచ్చడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల 'జై లవ కుశ' సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్సే.

ఈ వివాదం మహేష్ బాబు వద్దకు కూడా చేరింది. ఆయన స్పందిస్తూ చిత్రం బాగుంటే బాగుందని, బాగాలేకుంటే బాగాలేదని సమీక్షకులు రాస్తున్నారని, సినిమాలో ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపుతారని, దీనిపై ఎందుకు వివాదాలు వస్తున్నాయో అర్థం కావటంలేదని చెప్పాడు.

తాజాగా స్పైడర్ వంతు

తాజాగా స్పైడర్ వంతు

తాజాగా స్పైడర్ మూవీ విడుదలైంది. ఎన్టీఆర్ ఏదో అన్నాడనో, మహేష్ ఇలా అభిప్రాయ పడ్డారనో.... ఎవరూ తమ పని మానుకోలేదు. ‘జై లవ కుశ' సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఎత్తి చూపినట్లే.... ‘స్పైడర్' సినిమా విషయంలో తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.


పాఠకుడికి... విమర్శకుడి తేడా ఏంటి?

పాఠకుడికి... విమర్శకుడి తేడా ఏంటి?

ప్రేక్షకుడికి.... సినీ విమర్శకుడి చాలా తేడా ఉంది. ఒక సినిమా విడుదలైనపుడు సదరు ప్రేక్షకుడు ఆ హీరో అభిమాని అయితే అతడి అనుభూతి ఒకలా ఉంటుంది. సాధారణ ప్రేక్షకుడు అయితే ఒకలా ఉంటుంది. ఒక సినిమాను సాధారణ ప్రేక్షకుడు చూసి కేవలం రసస్పందన పొందుతాడు. అందులో అతడికి సంతృప్తి ఏ మేరకు లభించింది అనేదానిపై సినిమా విజయం ఆధార పడి ఉంటుంది.


క్రిటిక్స్

క్రిటిక్స్

సినీ విమ్శకుడు(క్రిటిక్) అనేవాడు కేవలం రస స్పందన పొంది వదిలెయ్యకుండా, మర్శనాత్మకంగా లోపాలను విశ్లేషిస్తాడు. అది అతడి వృత్తి ధర్మం. ప్రేక్షకులు గుర్తించలేని, వారి ఊహకు అందరి అంశాలను అతడు విశ్లేషిస్తాడు. సాధారణ ప్రేక్షకుడికన్నా భిన్నంగా విమర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది.


క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్స్, ప్రేక్షకులు ఇలా

క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్స్, ప్రేక్షకులు ఇలా

స్పైడర్ సినిమాలోని ప్లస్ పాయింట్లను, మైనస్ పాయింట్లను క్రిటిక్స్ ఎత్తి చూపుతున్నారు. సినిమాకు వారి నుండి యావరేజ్ రేటింగ్ మాత్రమే లభిస్తున్నాయి.


అయితే కొందరు ప్రేక్షకలు ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో సినిమా బావుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. థియేటర్ల వద్ద కొందరు ప్రేక్షకులు సినిమా యావరేజ్ అంటూ తేగేసి చెబుతున్నారు.


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

సినిమాలో మహేష్ బాబు, ఎస్.జె. సూర్య, సినిమాటోగ్రఫీ, ఉమెన్ ఎపిసోడ్, రకుల్ ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలతో క్రిటిక్స్ అభిప్రాయాలు కూడా సరితూగడం గమనార్హం.


మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదని, స్టోరీ కూడా అంత ఆసక్తిగా లేదని అంటున్నారు. లాజిక్ లేని సీన్లు, గ్రాఫిక్స్, క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా నిలిచాయని విశ్లేషిస్తున్నారు.


అయితే క్రిటిక్స్ విశ్లేషణలకు భిన్నంగా కొందరు ప్రేక్షకులు స్క్రీన్ ప్లే ఫర్వాలేదని అంటున్నారు. గ్రాపిక్స్ మాత్రం బడ్జెట్ కు తగిన విధంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


ఆశించిన స్థాయిలో లేదు

ఆశించిన స్థాయిలో లేదు

సినిమా కాంబినేషన్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ... సినిమా ఆశించిన స్థాయిలో లేదు అని అంటున్నారు క్రిటిక్స్.


సూపర్ స్టార్ స్థాయి సినిమా కాదు

సూపర్ స్టార్ స్థాయి సినిమా కాదు

చాలా మంది క్రిటిక్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్ కు తగిన కథాంశం కాదని, చాలా యావరేజ్, రొటీన్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడని కొందరు క్రిటిక్స్ తమ రివ్యూల్లో రాశారు.


అంత హైగా లేదు

అంత హైగా లేదు

మురుగదాస్, మహేష్ బాబు కాంబినేషన్ అంటే హై మూమెంట్స్, హై రేంజిలో ఎంటర్టెన్మెంట్ ఆశిస్తాం.... అయితే ఆ స్థాయిలో సినిమా లేదని కొందరు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.


క్రిటిక్స్ రివ్యూ ఆధారంగా సినిమాలు ఆడతాయా?

క్రిటిక్స్ రివ్యూ ఆధారంగా సినిమాలు ఆడతాయా?

అయితే క్రిటిక్స్ రివ్యూల ఆధారంగా సినిమాలు ఆడటం, ఆడక పోవడం ఉండదు. విమర్శకుల ఆలోచనలతో, వారు ఎత్తిచూపే అంశాలతో సంబంధం లేకుండా ప్రేక్షకలు సినిమాను ఎంజాయ్ చేస్తాడు. వారు సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారు అనే దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.


English summary
SPYder movie critic reports are very disappointing. Some reports say, the film Spyder does not live up to the expectations. It is a pretty average fare.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu