»   » వేలానికి ఎన్టీఆర్..కిరీటం, వేణువు: దిల్‌ రాజు

వేలానికి ఎన్టీఆర్..కిరీటం, వేణువు: దిల్‌ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఇది వరకు 'అదుర్స్‌'లో ఎన్టీఆర్‌, 'మగధీర'లో రామ్‌చరణ్‌, 'సింహా'లో బాలకృష్ణ ఉపయోగించిన వస్తువులు వేలం వేశాం. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని పేద కళాకారుల కోసం ఉపయోగించాం. ఇప్పుడు 'బృందావనం'లో ఎన్టీఆర్‌ ధరించిన కిరీటం, వేణువులను వేలానికి ఉంచుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ సంప్రదాయం కొనసాగిస్తాం" అంటున్నారు 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) అధ్యక్షులు మురళీమోహన్‌.

దిల్‌ రాజు మాట్లాడుతూ "ఈ విధంగా పేద కళాకారులకు నిధులు సమకూర్చుకోవడం బాగుంది. పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి కూడా ఏం బాగోలేదు. వాళ్ల కోసం కూడా ఈ తరహా కార్యక్రమం మొదలుపెడితే బాగుంటుంది. ఇక నుంచి నేను నిర్మించే ప్రతి సినిమాకూ రూ.1 లక్ష చొప్పున 'మా'కు అందిస్తా" అన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, ఉత్తేజ్‌, హేమ, కాదంబరి కిరణ్‌, మాణిక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu