twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరెంట్ తీగ ఆడియో: వర్మను చొక్కాపట్టి లాగారు(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నటుడు మోహన్ బాబు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య సాన్నిహిత్యం ‘రౌడీ' సినిమా తర్వాత బాగా పెరిగింది. వర్మను మోమన్ బాబు డార్లింగ్ అని పిలుస్తుంటారు. తాజాగా ‘కరెంటు తీగ' ఆడియో వేడుకలో రామ్ గోపాల్ వర్మను మోహన్ బాబు సరదాగా చొక్కపట్టి లాగారు. తొలుతు ఈ సీన్ చూసిన వారు కాస్త ఆశ్చర్యపోయినా...తర్వాత వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం గమనించి లైట్ తీసుకున్నారు.

    ఇక ‘కరెంటు తీగ' ఆడియో వేడుక విశేషాల్లోకి వెలితే... మంచు మనోజ్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం కార్యక్రమం ఆదివారం పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందించారు. జంగ్లీ మ్యూజిక్స్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది.

    ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా హాజరైన దాసరి నారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేసి, కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డికి అందజేసారు. అనంతరం దాసరి మాట్లాడుతూ...'హీరోగా మనోజ్ ది పదేళ్ల యాత్ర. పది సంవత్సరాల కెరియర్ అంటే, బిగినింగ్ స్టేజ్ దాటుకుని మరో అడుగు ముందుకు వేయడమే. అసలు కెరియర్ ఇప్పుడే ఆరంభమవుతుంది. ఆ రకంగా 'కరెంట్ తీగ' మనోజ్ కి తొలి సినిమా అవుతుంది. మనోజ్ రిస్క్ లు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను. 'కరెంట్ తీగ'' కథ నాకు తెలుసు. చాలా మంచి కథ. జి.నాగేశ్వరరెడ్డికి ప్రేక్షకులను ఎలా మెప్పించాలో బాగా తెలుసు. కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నీ బాగా చేయగలడు. అన్నారు

    స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు....

    కరెంట్ తీగ ఆడియో వేడుక 1

    కరెంట్ తీగ ఆడియో వేడుక 1


    మోహన్ బాబు మాట్లాడుతూ...మనోజ్ హీరోగా పదేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రెడిట్ తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ దక్కుతుంది. మా గురువు దాసరిగారికున్న అలవాట్లన్ని మనోజ్ కి వచ్చాయని వ్యాఖ్యానించారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 2

    కరెంట్ తీగ ఆడియో వేడుక 2


    విష్ణుకు జి.నాగేశ్వరరెడ్డి 'దేనికైనా రెడీ'తో మంచి విజయాన్ని అందించాడు. మనోజ్ కి కూడా 'కరెంట్ తీగ'తో మరో హిట్ ఇస్తాడనే నమ్మకం ఉందని మోహన్ బాబు తెలిపారు. విష్ణుతో అనుక్షణం సినిమా తీసిన వర్మను కూడా మోహన్ బాబు మెచ్చుకున్నారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 3

    కరెంట్ తీగ ఆడియో వేడుక 3


    మనోజ్ మాట్లాడుతూ...సినిమా అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చి నా గురువు దాసరిగారి దగ్గర్నుంచి వచ్చిందే. నేను చదువుపైన శ్రధ్ధ పెట్టేవాడిని కాదు... నిజం చెప్పాలంటే అసలు కుదురుగా ఉండేవాడిని కాదు. కానీ సినిమాలపైన నాకున్న ఇష్టాన్ని నాన్నగారు గుర్తించి, నన్ను నటుడిగా నిలబెట్టారు. అందుకు ఆయనకు పాదాభివందనాలు అని తెలిపారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 4

    కరెంట్ తీగ ఆడియో వేడుక 4


    అన్నయ్య విష్ణు గురించి మనోజ్ మాట్లాడుతూ...నేను ఎన్ని తప్పులు చేసినా, వాటిని దాస్తూ, ఎప్పటికప్పుడు నన్ను మంచి దారిలో నడిపిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చిన నా అన్నయ్య విష్ణుకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 5

    కరెంట్ తీగ ఆడియో వేడుక 5


    మంచు లక్ష్మి గురించి మనోజ్ మాట్లాడుతూ...మా అక్క లక్ష్మీప్రసన్న నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది. నా కుటుంబ సభ్యులు సహకారంతోనే సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగుతున్నాను. నా వెన్నంటే ఉండే నా ఫ్రెండ్స్ కి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 6

    కరెంట్ తీగ ఆడియో వేడుక 6


    మీడియా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తోంది. నా పదేళ్ల కెరియర్ విజయవంతంగా సాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. 'కరెంట్ తీగ' చాలా మంచి సినిమా. నాగేశ్వరరెడ్డిగారు అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని మనోజ్ చెప్పుకొచ్చారు.

    కరెంట్ తీగ ఆడియో వేడుక 7

    కరెంట్ తీగ ఆడియో వేడుక 7


    దర్శకుడు మాట్లాడుతూ...మోహన్ బాబుగారికంటే అద్భుతమైన నటుడు మనోజ్. జగపతిబాబుగారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పట్నుంచి సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక బలంగా ఉండటం వల్లే ఈ సినిమాకి అది కుదిరిందని భావిస్తున్నాను. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ చాలా బాగా నటించారు. మోహన్ బాబుగారి బ్యానర్ నుంచి అర్థరాత్రి ఫోన్ వచ్చినా... మరుసటి రోజు షూటింగ్ చేయడానికి నేను రెడీ. ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్'' అని తెలిపారు.

    English summary
    Current Theega Audio Launch held event at at Park Hyatt hotel in Hyderabad. Mohan Babu, Manchu Manoj, Vishnu Manoj, Rakul Preet Singh, Ram Gopal Varma and Jagapathi Babu graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X