రామానాయుడు 3 తీరని కోరికలు, అందులో జూ ఎన్టీఆర్...
హైదరాబాద్: రామానాయుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న పేరు తెలుగు చిత్రసీమలో ఉంది. కానీ.. అలాంటి వ్యక్తికి సైతం మూడు కోరికలు మిగిలిపోయాయని చెబుతారు. అందులో మొదటిది తాను నిర్మించిన రాముడుభీముడు సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో పునర్మించాలన్నది ఆయన ఆశ.
దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు కూడా జరిగి ఆగిపోయాయి. ఇదే విషయాన్ని రామానాయుడు దగ్గర కొన్నాళ్ల క్రితం ప్రస్తావించినప్పుడు.. ‘‘ఇప్పటికీ నాకు ఆ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తోనే నిర్మించాలి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ సినిమాకు న్యాయం చేయగలరు. ఒకవేళ నా కోరిక నెరవేరకపోతే... కనీసం పాత సినిమాను కలర్ లోకైనా మారుస్తా'' అని చెప్పేవారు.

ఇక.. రామానాయుడు తీరని కోరికల్లో మరొకటి.. దర్శకత్వం వహించటం. దాదాపు 150 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్వప్నం సాకారం కాలేదు. ఇక మూడో కల.. తన కొడుకు, మనమళ్లతో కలిసి ఒక సినిమా నిర్మించాలని...ఆ కోరిక కూడా తీరకుండానే ఆయన కాలం చేయడం విషాదం.


Click it and Unblock the Notifications











