For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీప్ పబ్లిసిటీ కోసమే సినీ ఆందోళనలు:డి సురేష్ బాబు

  By Srikanya
  |

  హైదరాబాద్: వరసగా సినీ వివాదాలు తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న నేపధ్యంలో తెలుగు సిని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డి.సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ వివాదాలన్నీ కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే అని కొట్టిపారేసారు. ఆయన ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపరు తో మాట్లాడుతూ... "జనాలు పాపులారిటీ సంపాదించుకోవటానికి ఇది చాలా సులభమైన మార్గం. ఎందుకంటే సినిమాలపై ఎక్కువ మంది దృష్టి ఉంటుంది. కాబట్టి సినిమాలను టార్గెట్ చేస్తే సులభంగా పాపులారిటి వస్తుంది. అలాగే రాష్ట్రంలో మీడియా కూడా బాగా అభివృధ్ది చెందింది. ప్రతీ వివాదానికి అది చిన్నదైనా,పెద్దదైనా ప్రచారం కల్పిస్తోంది. అవి మీడియా అటెన్షన్ పొందుతున్నాయి. ఇలాంటివి జరగటం సినిమావారికి మొదటిసారేం కాదు." అన్నారు.

  అలాగే ఈ వివాదాలవల్ల సినిమాలపై ఎంతవరకూ ప్రభావం ఉంటుంది అన్న విషయం మాట్లాడుతూ..."ఇలా సినిమాలపై వచ్చే అభ్యంతరాలు పిల్మ్ మేకర్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కలెక్షన్స్ పైనా ప్రభావం ఉంటుంది. అయితే సినిమా సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది మాత్రం సినిమాలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా బాగుంటేనే డబ్బు తెచ్చిపెడుతుంది. "అని చెప్పారు. అయితే ఆయన సినిమా చూసే జనం మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తమ సినిమా వారికి సపోర్టు ఇవ్వటానికే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ వర్గీయులు విశ్లేషిస్తున్నారు.

  మరో ప్రక్క సెన్సార్ వారి విధానాలు సరిగా లేనందువల్లే సినిమాలపై ఈ వివాదాలు చోటు చేసుకుంటున్నాయన్న మాటను ఎపి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. ఆయన మాట్లాడుతూ... "చూడండి, సెన్సార్ బోర్డుకి దానికంటూ క్లియర్ గా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే అది నడుస్తుంది. అవి ఎలాంటివి ,ఎంతవరకూ ప్రయోజనకారి అనేది మరో చర్చ. మనం మొదట ఇలా సినిమాల అక్షేపణలు చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటో ఆలోచించాలి. సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనవి ఉంటే ఆ వర్గం చూడటం ఎందుకు మానేయాలి. ఇలా వివాదానికి దిగటం వల్ల ఆ సినిమాలకు పబ్లిసిటీ చేయటం వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమి లేదు . సినిమాలు కేవలం వినోదం కోసమే ఎవరైనా తీస్తాము ," అని తేచ్చిచెప్పారు.

  ఇక ఈ మధ్య కాలంలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తెలంగాణా ఉద్యమాన్ని కించపరుస్తూ తీసారని తెలంగాణావాదులు ఆందోళన చేసారు. ఆ తర్వాత బ్రాహ్మనిజం,దేనికైనా రెడీ చిత్రాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు తిరగబడ్డాయి. ఇప్పుడు బస్ స్టాఫ్ చిత్రం యువతను తప్పు దారిపట్టిస్తోందని స్టూడెంట్ సంఘాలు మండిపడుతున్నాయి.

  English summary
  Telugu film producer's council president, D Suresh Babu, believes that movies become easy targets for "mischief mongers" looking for some cheap publicity "by making a mountain out of a molehill". He says, "The easiest way to gain popularity is to target a film because of the mass popularity movies enjoy. Also, the media has grown manifold in the state and any protest, however big or small, manages to grab media attention. So, it's something we as filmmakers have learned to live with. In any case, this is not the first time something like this is happening."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X