»   » పెళ్ళిచూపులు రిజల్ట్ రిపీట్ అవుతుందా..?? మంచి అంచనాలతో "మెంటల్ మదిలో"

పెళ్ళిచూపులు రిజల్ట్ రిపీట్ అవుతుందా..?? మంచి అంచనాలతో "మెంటల్ మదిలో"

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ విష్ణు ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లోకి వచ్చిన యువ హీరోల్లో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన నటుడు. ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రానికి మెంటల్ మదిలో అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక క్యాప్షన్ గా మనవి ఆలకించరాదే అని పెట్టారు.

న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు.

English summary
D Suresh Babu garu launched the trailer of Mental Madhilo and appreciated Raj Kandukuri and Vivek Athreya for the attempt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu