twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన ఫైటర్లతో సినిమాల్ని క్వాలిటీగా తీయలేం: డి సురేష్ బాబు

    By Srikanya
    |

    నైపుణ్యం విషయంలో చెన్నై టెక్నీషియన్లకు, మనకూ చాలా తేడా ఉంది. ఇక్కడున్నవారు తన ట్యాలెంట్ ని ప్రదర్శించాలి. కొందరు అశ్రద్ధతో...సులభంగా ఫైటింగ్‌ సన్నివేశాల్ని చేసాద్దామన్న ధోరిణిలో ఉన్నారు. దాంతో నిర్మాత తనకు కావాల్సిన వారినే తీసుకుంటున్నారు. నిర్మాతకు ఎవరినైనా తీసుకునే హక్కు ఉంది. రామ్‌లక్ష్మణ్‌లకు మద్రాస్‌ సభ్యత్వం ఉంది. దీనిపై గొడవ జరిగింది.

    ఈ విషయమై వారు వివరణ ఇచ్చారు. అక్కడ సభ్యత్వం లేకపోతే నైపుణ్యం కలిగిన ఫైటర్లు రారు. ఇక్కడి ఫైటర్లతో సినిమాల్ని క్వాలిటీగా తీయలేం అన్నారు.అలాగే లోకల్‌ ఫైటర్లలో యువకులు ‌ చాలా మంది ఉన్నారు. వారూ చైన్నై వారితో సమానంగా ఫైట్స్‌ చేయగలరు. కానీ ఇక్కడ ఫైటర్లకు చెందిన పెద్దలు వారిని రానివ్వరు. వయస్సు మీదబడినా సీనియర్లే వచ్చి ఫైట్లు చేస్తామంటారు.

    ఉదాహరణకి ఓ సీన్‌లో కాల్పులు జరుగుతాయి. ఫైటింగ్ లు కూడా ఉన్నాయి. దూకడాలు, అద్దాలు పగిలిపోతే పడిపోవడాలు చేయాలి. లోకల్‌ ఫైటర్లు 10 మంది వస్తారు. అంతా... తాము కాల్పులో చచ్చిపోయే పాత్రలువేస్తాం అంటారు. చనిపోయే పాత్ర వేస్తే... ఆ సీన్‌ ఉన్నన్ని రోజులు అతను అలా పడుకుని ఉండాలి. కష్టపడనవసరంలేదు. ఎవరికివారు పోటీపడతారు. మరికొంతమంది వెనకాలే ఉంటాం అంటారు.

    ఎందుకంటే... వారంతా మోకాలు సమస్యలతో, వెన్నెనొప్పితో ఇలా రకరకాల సమస్యల్తో ఉంటారు. కానీ లోకల్‌ యూత్‌ ఫైటర్లను ప్రోత్సహించరు. అందుకే చెన్నై ఫైటర్లు కష్టపడేవారిని పెట్టుకుని పని చేయిస్తారు. నిర్మాతకు కావాల్సింది పని జరగాలి. దానికి లోకల్‌ నాన్‌లోకల్‌ సమస్యతో సంబంధంలేదు. అది అసోసియేషన్‌ చూసుకోవాలి. నిర్మాతకు ఎవరితోనైనా పనిచేసుకునే హక్కు ఉంది అని వివరించారు.

    ఇక సమస్య పరిష్కారం గురించి చెబుతూ... 'డిసెంబర్‌ 8న 'కందిరీగ' షూటింగ్‌లో తెలుగు ఫైటర్లు తాగి చెన్నై ఫైటర్లపై దాడిచేశారు. ఆ విషయాన్ని అక్కడి లైట్‌మెన్‌లు, ప్రొడక్షన్‌ యూనిట్‌, ఇతర సభ్యులు చూశారు. కెమెరామెన్‌ షూట్‌చేశారు. ఫోటోలు కూడా తీశారు. ఇవన్నీ సాక్ష్యం.. దీనిపై ఫైటర్ల అసోసియేషన్‌, ఫెడరేషన్‌కు ఫిర్యాదుచేస్తే... ఇంతవరకు సరైన సమాధానం లేదు. దాడికి పాల్పడిన 10 మంది ఫైటర్ల వల్ల నిర్మాతకూ నష్టం చేకూరింది. వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. వారు ఎప్పుడైతే చర్య తీసుకుంటారో అప్పుడు బంద్‌ ముగుస్తుంది' అని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తేల్చి చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X