»   » దాబూ రత్నానీ 2016 క్యాలెండర్ టీజర్ (వీడియో)

దాబూ రత్నానీ 2016 క్యాలెండర్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి సంవత్సరం విడుదలయ్యే దాబూ రత్నానీ క్యాలెండర్‌కు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన దాబూ రత్నానీ కెమెరా ముందు ఏలాంటి ఫోజులు ఇవ్వడానికైనా సిద్దంగా ఉంటారు బాలీవుడ్ టాప్ స్టార్స్. గతేడాది బాలీవుడ్ టాప్ స్టార్లతో క్యాలెండర్ రూపొందించిన దాబూ రత్నానీ... ఈ ఏడాది కూడా సరికొత్త క్యాలెండర్ రూపొందించారు.

బాలీవుడ్ స్టార్లతో దాబూ రత్నానీ రూపొందించిన 2016 క్యాలెండర్ ఈ నెలలోనే విడుదల కాబోతోంది. ఈ క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమాన్ని ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో ప్రముఖల సమక్షంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్యాలెండర్ రిలీజ్ కు ముందుగా బాలీవుడ్ స్టార్ల అభిప్రాయాలతో కూడిన ఓ టీజర్ విడుదల చేసారు.

అందులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, విద్యా బాలన్, వరున్ ధావన్, హృతిక్ రోషన్, సిద్దార్థ మల్హోత్ర, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఉన్నారు ఉన్నారు. ఆ క్యాలెండర్ టీజర్ పై మీరూ ఓ లక్కేయండి.

Dabboo Ratnani 2016 Calendar Teaser
English summary
Dabboo Ratnani 2016 Calendar Featuring Akshay Kumar, Shah Rukh Khan, Hrithik Roshan, Varun Dhawan, Farhan Akhtar, Mr Amitabh Bachchan, Sidharth Malhotra, Abhishek Bachchan, John Abraham, Arjun Rampal, Ranbir Kapoor, Ranveer Singh, Alia Bhatt, Parineeti Chopra, Shraddha Kapoor, Kriti Sanon, Lisa Haydon , Priyanka Chopra , Aishwarya Rai Bachchan , Jacqueline Fernandes , Anushka Sharma, Athiya Shetty, Vidya Balan, Sonakshi Sinha , Myrah Ratnani, Kiara Ratnani, Shivaan Ratnani, Manisha Ratnani, Dabboo Ratnani.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu