»   » కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోగ్రాఫర్ తో ఎన్టీఆర్

కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోగ్రాఫర్ తో ఎన్టీఆర్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ క్యాలెండర్ కి ఫోటో గ్రాఫర్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని త్వరలో ఎన్టీఆర్ తో కలిసి పనిచేయనున్నారు. ఆయన ఇండియాలో టాప్ ఫ్యాషన్, సెలబ్రేటీ ఫోటో గ్రాఫర్. ఎన్టీఆరో తో స్పెషల్ ఫోటో షూట్ చేయటం కోసం హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఈ ఫోటో షూట్ సినిమాల కోసం మాత్రం కాదు. ఓ యాడ్ క్యాంపైన్ కోసం ప్రత్యేకంగా చేయిస్తున్నారు. చాలా డిఫెరెంట్ గా ఉండాలని ఈ స్టార్ ఫోటో గ్రాఫర్ ని పిలిపిస్తున్నారు. మలబార్ గోల్డ్ కంపెనీ కోసం ఈ ఫోటో షూట్ జరగనుంది.

  ఇక బాలికా విద్య, మహిళా సాధికారతకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సామాజిక బాధ్యతతో చేయూతనందిస్తోందని సంస్థ బ్రాండ్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో 'విద్యాసాధికారత, మహిళా సాధికారత' అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంత రం గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఓ.ఆషర్ మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5 వేల మంది బాలికలకు రూ.2 వేల చొప్పున ఉపకారవేతనాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. స్కాలర్‌షిప్ దరఖాస్తులను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లలో పొందవచ్చన్నారు.

  ప్రస్తుతం ఎన్టీఆర్.. శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో... ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.

  ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

  English summary
  Dabboo Ratnani, one of the India's leading celebrity and fashion Photographer, came down to Hyderabad to shoot a special photoshoot with NTR. The photoshoot was for an ad campaign. NTR is the brand ambassador for Malabar Gold and the company brought in Daboo Ratnani who generally works with big stars of Bollywood.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more