»   » నాన్న మాట వినకుండా చిరు, పవన్ దారిలో వరుణ్ తేజ్

నాన్న మాట వినకుండా చిరు, పవన్ దారిలో వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్దలు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంత మంది పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలని కలలుకంటే మరికొందరు యాక్టర్లు, డైరెక్టర్లుగా చేయాలనుకుంటారు. అయితే ఈ జనరేషన్ పిల్లలు మాత్రం పెద్దల మాట వినకుండా తమకు నచ్చిన దారిలో వెళతారు. తాజాగా వరుణ్ తేజ్ విషయంలో ఇదే జరిగింది. నాగబాబు తన కొడుకుని డైరెక్టర్ చేయాలనుకున్నాడు. కానీ వరుణ్ తేజ్‌కి అది నచ్చలేదు. పెదనాన్న, బాబాయ్ దారిలో నడిచాడు.

ఈ విషయమై వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘నాన్న నన్ను డైరెక్టరుగా చూడాలనుకున్నాడు. నేను మంచి సినిమాలు తీస్తే చూడాలని ఆశపడ్డాడు. కానీ నాకు ఆ రంగంపై ఆసక్తి ఉండేది కాదు. పెదనాన్న, బాబాయ్ ప్రభావం నాపై బాగా ఉండేది. అందుకే వారి దారిలోనే నడిచాను. నటున్ని అయ్యాను' అని చెప్పుకొచ్చారు.

నన్ను చాలా భయపెట్టే విషయం ఒకటుంది అది డ్యాన్సులు. నా దగ్గరకొచ్చే చాలామంది అభిమానులు చరణ్ అన్నలాగా, బన్నీలాగా డ్యాన్సులు వేయమంటారు. కానీ వాళ్ళలా చేయడం నావల్ల కాదు. నిజానికి చరణ్, బన్నీలతో తనకు చనువు తక్కువేనని, చిన్నప్పటి నుండి శ్రీజ(చిరంజీవి చిన్న కూతురు), సాయిధరమ్ తేజ్ తోనే ఎక్కువగా ఆడుకునే వాడినని తెలిపాడు.

Dad Wanted Me To Become Director: Varun Tej

వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తొలి చిత్రంతో వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభం అయింది.

ఈ చిత్రానికి ‘కంచె' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించింది.

English summary
"Although I come from a family with acting background, Dad always wanted me to become director and he wished to see me making good films. However, I'm interested into acting and always dreamt of following footsteps of Peddananna Chiranjeevi and Baabayi Pawan Kalyan," shared Varun in an interview to a leading daily.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu