»   » సబ్ మెరైన్ బైక్ కొనేసిన రానా.., ఇది కొన్నందుకు గర్వంగా ఉన్నా అంటూ ...

సబ్ మెరైన్ బైక్ కొనేసిన రానా.., ఇది కొన్నందుకు గర్వంగా ఉన్నా అంటూ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దగ్గుబాటి రానా ఓ బైక్ కొన్నాడు . .బజాజ్ నుండి వచ్చిన వి 15 బైక్ రీసెంట్ గానే మార్కెట్ లోకి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దాని కంటే దాని అమ్మకం అద్భుతంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే 25 వేల దాకా బైకులు అమ్ముడవ్వడం విశేషం. అలాగని ఇదేమీ బాగా ఖరీదైన బైక్ కాదు. బజాజ్ 'వీ' పేరుతో ఆ కంపెనీ తయారు చేసిన లేటెస్ట్ మోడల్ 150 సీసీ బైక్ అంతే.

కాస్ట్ అయితే.. ఆన్ రోడ్ ప్రైస్ 70వేల రూపాయల వరకూ ఉంటుంది. అయితే ఇదే బైక్ ని రానా లాంటి సెలబ్రిటీ ఏరి కోరి మరీ ఇష్టంగా కొనుక్కున్నాడు.. ఈ మాత్రం ధరతో ఓ బైక్ కొనడం చాలా సింపుల్ మేటర్. కానీ రానా కొత్త బైక్ ట్రెండింగ్ అవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. లేటెస్ట్ మూవీ ఘాజీ ప్రమోషన్స్ కోసం బజాజ్ వి ని కొనుగోలు చేశాడు రానా. రెండింటికీ లింక్ ఏంటి అనుకోవచ్చు కానీ.. అదే అసలు కహానీ.

Daggubati Rana Buys Bajaj Vikrant Bike to Promote The Ghazi Attack

చరిత్ర ప్రకారం పాకిస్తాన్ సబ్మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. ఇండియన్ సబ్మెరైన్ ఎస్ 21 పై దాడి చేస్తుంది. ఘాజీ తునాతునకలు అయిన విషయాన్ని కొన్ని నెలల తర్వాత.. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఇండియన్ సబ్మెరైన్ గుర్తించిందన్న సంగతి తెలిసిందే. 1971లో జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధంలో కీలకమైన పాత్ర వహించిన చరిత్ర ఐఎన్ఎస్ విక్రాంత్‌కు ఉంది.

ఇండియాకు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ విమాన వాహక నౌకకు చెందిన మెటల్ నుంచే ఈ బైక్ తయారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అమీర్‌ఖాన్.. బజాబ్ కంపెనీ 150సిసి మోటార్‌సైకిల్‌ను గత మార్చిలో ఇండియాలో ప్రవేశపెట్టింది. ఆ నెలాఖరు నుంచి ఆర్డర్స్ డెలివరీ ప్రారంభించింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కు సంబంధించిన మెటల్ ను ఉపయోగించి.. 'విక్రాంత్'ను ప్రతిబింబించేలా లేటెస్ట్ మోడల్ కు 'వి' అనే పేరు పెట్టింది బజాజ్ కంపెనీ.

Daggubati Rana Buys Bajaj Vikrant Bike to Promote The Ghazi Attack

భారత తొలి విమానవాహక నౌక ఐఎన్ఎన్‌ విక్రాంత్ నుంచి తయారు చేసిన బైక్ ఇది. ఈ విషయం విన్న వెంటనే ఆర్డర్ ఇచ్చేసాడట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. "ఇది నిజంగా ఓ స్పెషల్ బైక్. మిగతా వేటితోనూ ఈ బైక్‌ను పోల్చలేం. చరిత్రను తనలో పొందుపరుచుకున్న బైక్ ఇది.

భారత సైన్యానికి దశాబ్దాలుగా గర్వకారణంగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్‌కు చెందిన మెటల్ పీస్‌తో దీన్ని తయారు చేయడం, దానిని తాన సొంతం చేసుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను" అని అప్పూడు అమీర్ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ఇప్పుడు రానా కూడా ఆ విషయం తెలిసిన తర్వాత.. బజాజ్ 'వి' బైక్ ను కొనుగోలు చేశాడు. ఈ బైక్ తన దగ్గర ఉండడం గర్వంగా అనిపిస్తోందని చెప్పాడు రానా.

English summary
Rana Daggubati, who will be seen essaying the role of a naval officer, Lt. Commander Arjun Varma, in ‘The Ghazi Attack’ is keen to buy Bajaj V bike as a memorabilia from the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu