»   » ‘లీడర్ రాణా’ను ష్యాషన్ పురుగు కుట్టిందట...!

‘లీడర్ రాణా’ను ష్యాషన్ పురుగు కుట్టిందట...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లీడర్ సినిమా తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన రాణా ఒక సాదాసీదా హీరోగా ప్రేక్షకులని బాగానే ఆకట్టు కున్నాడు. రామానాయుడు మనవడు రాణా ఇప్పుడు మోడల్ అవతారం ఎత్తుతున్నాడు. గతంలో హైదరాబాద్ డిజైనర్ అస్మితా మార్వా డ్రెస్ కలెక్షన్ కు మోడల్ గా తొలిసారి ర్యాంప్ ఎక్కిన రాణా ఇప్పుడు మరోమారు ఆమె కలెక్షన్నే ప్రదర్శించటానికి సిద్దమయ్యాడు. బ్లెండర్స్ ఫ్రైడ్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఫ్యాషన్ వీక్ ల్లో ఢిల్లీ, హైదరాబాద్ లలో అస్మిత కలెక్షన్స్ ను రాణా ప్రదర్శించనున్నాడు. ఈ విషయాన్ని రాణా స్వయంగా చెప్పాడు.

బ్లెండర్స్ ఫ్రైడ్ సంస్థ నిర్వహిస్తోన్న ఓ ఫ్యాషన్ షోకు మోడల్స్ ను ఎంపిక చేయటానికి న్యాయనిర్ణేతగా వచ్చిన రాణా దేశవ్యాప్తంగా మోడలింగ్ రంగంలోకి రావాలనుకునే యువతకు అవాకాశం ఇస్తూ నిర్వహిస్తోన్న ఈ షోకు నన్ను ఆహ్వానించటం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఈ క్రమంలోనే డిజైనర్లు ఎంత అద్భుతంగా ఓ కలెక్షన్ ను సృష్టించినప్పటికీ వాటిని సరైన మోడల్ ప్రదర్శంచకపోతే డిజైనర్ శ్రమ అంతా వృదా అయినట్టే అని విశ్లేషించాడు.

English summary
Daggubati Rana is bitten by Fashion bug. Yes, this Tollywood ‘Leader’ has taken up his new role as a Male Model for his close friend and creative Fashion designer Asmita Marwa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu