‘రాంబాబు’ వివాదం పై దగ్గుపాటి రానా

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణాలో నిరసనలు వ్యక్తం అయి వివాదంలో ఇరుక్కుని బయిటపడిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఏ తెలుగు హీరో కూడా సాహసించి ఈ చిత్రం వివాదంపై మాట్లాడటానికి సాహసించలేదు. అయితే దగ్గుపాటి రానా మాత్రం స్పందించారు. తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం చిత్రం విడుదల సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై తన అభిప్రాయాలు తెలియచేసారు.

రానా మాటల్లో... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై వచ్చిన వ్యతిరేకత ఏమాత్రం బాలేదు. జగన్‌ (పూరీ జగన్నాథ్‌) మంచి దర్శకుడు, సాధారణంగా తన చిత్రాల్లో తనదైన ఫన్ తో పంచ్ లు వేస్తారు. ఏ దర్శకుడూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి సినిమాలు తీయరు. చిత్రాలనేవి ఓ కళారూపం. దర్శకుడు ఏదైనా సమకాలీన అంశాన్ని చిత్రంలో స్పృశిస్తే అందులో తప్పేంటి? ఇంకాచెప్పాలంటే దాని మంచిచెడ్డల్ని నిర్ణయించి సర్టిఫీకెట్‌ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు వుంది. ఆ చిత్రంలో విలన్ పాత్రకు నా పేరు పెడుతున్నట్టు జగన్‌ నాతో చెప్పారు. ఆ చిత్రం వల్ల ఎవరైనా బాధప డాల్సి వస్తే ముందది నేనే అవాలి మరి!! అన్నారు.

కృష్టం వందే జగద్గురుం చిత్రం దీపావళికి విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి చెపుతూ...'ఇది నా ఆరో చిత్రం, బహుశా ఇప్పటి వరకూ చేసిన వాటిలో ఇదే పెద్దది అవుతుందేమోకూడా. ఇందులో నా పాత్ర పేరు బి.టెక్‌ బాబు. సురభి నాటక కళాకారుడిని. కాని ఈ పాత్రకి నాటకాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అమెరికా వెళ్లి చదువుకోవాలన్నది కల. అయితే, చివరిసారినాటకం వేయడానికి బళ్లారి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రకంగా ఆ పాత్ర తన గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఆలోచించే క్రమంలో ఆ పాత్ర రూపుదిద్దుకుంటుంది.' అన్నారు.

హీరోయిన్ నయనతార గురించి చెపుతూ... ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు హిరోయిన్‌ ఎవరని ఏమీ అనుకోలేదు. తరువాత, కథ ముందుకు వెళ్తున్న కొద్ది, హీరోయిన్‌ పాత్ర కూడా పెరిగింది. ఆప్పుడు, నేను, క్రిష్‌ కూడా బాగా చేయగలిగినవాళ్ళు ఈ పాత్రకు కావాలనుకున్నాం. నయనతార మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటుంది అని తెలిసింది. అంతే, ఆమె కాకపోతే ఈ పాత్రకు ఇంకెవరూ సరిపోరు అనిపించింది. ఇందులో ఆమె ఓ జర్నలిస్టు. బళ్లారి ప్రాంతానికి వెళ్లి, అక్కడి సమస్యలు తెలుసుకుంటుంది. ఇందులో, ఆమె చేసిన పాత్ర చాలా ముఖ్యమైంది, బలమైంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X