Don't Miss!
- Finance
Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
'దళం'.. విడుదల తేదీ ఖరారు
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈచిత్రం గత సంవత్సరం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చాలా కాలం క్రితమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో కూడా గత డిసెంబర్లో విడుదలైంది. కానీ ఈ చిత్ర నిర్మాతలు సరైన విడుదల సమయం లేదని పక్కన పెట్టారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ నటించింది. జన జీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల జీవితం తర్వాత ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .
నిర్మాత సుమంత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలో విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్ నర్తించింది. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, పియాబాజ్‌పేయ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఛాయాగ్రహణం: సుధాకర్ యక్కంటి, సంగీతం: జేమ్స్ వసంతన్.