»   » కమల్ పై దళిత్ సంఘం కంప్లైంట్, ధర్నాలు చేస్తామంటూ హెచ్చరిక

కమల్ పై దళిత్ సంఘం కంప్లైంట్, ధర్నాలు చేస్తామంటూ హెచ్చరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కమల్‌హాసన్‌, ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'శభాష్‌ నాయుడు' చిత్రం షూటింగ్‌ లాస్‌ఏంజెల్స్‌లో ప్రారంభమైంది. అయితే ఈ లోగానే ఓ వివాదం మొదలైంది. దళిత్ అశోయేషన్ (అశోశియేషన్ ఫర్ పోగ్రస్) వారు ఈ చిత్రం షూటింగ్ అపు చేయాలని వారు కోయంబత్తూరులోని కలెక్టర్ ఆఫీస్ లో కంప్టైంట్ చేసారు.

ఆ పీటీషన్ లో..అశోశియేషన్ వారు అనేదేమిటంటే... ఈ సినిమా కేవలం ఓ కులాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. ఎలంగోవన్ ,ఈ అశోశియేషన్ ప్రసిడెంట్ మాట్లాడుతూ.. " ఈ సినిమా టైటిల్ 'శభాష్ నాయుడు' అని పెట్టడం ద్వారా, వారు నాయుడు కమ్యూనిటి ని మాత్రమే పెద్ద కులంగా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఎందుకుని వారు ఒకే కులాని హైలెట్ చేస్తూ సినిమా చేస్తున్నారు. అంటే మిగతా కులాలన్ని వారికన్నా తక్కువనా ?"అని ప్రశ్నించారు.

అలాగా..తాము తమిళనాడు గవర్నమెంట్ ని ..ఈ సినిమాని బ్యాన్ చేయటమో లేక..టైటిల్ మార్చటమో చేయమని కోరుతున్నా.. ఏ యాక్షన్ తీసుకోకపోతే..తాము భారీ ఎత్తున యాజిటేషన్ చేపట్టాల్సి ఉంటుందని. చెన్నై , కోయింబత్తూరు లలో తాము యాజిటేషన్ చేస్తామని చెప్పటం జరిగింది.

మరో ప్రక్క కమల్ తన సినిమా ప్రారంభమై విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... క్లాప్‌ కొడుతున్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

రెండు నాయుడులు, ఒక కుందుకోసం.. తొలిరోజు షూటింగ్‌ సజావుగా జరుగుతోందని, గొప్ప నృత్యకారులు, గొప్ప బృందం అని ట్వీట్‌ చేశారు.

నటి శ్రుతిహాసన్‌ తొలిరోజు షూటింగ్‌లో తండ్రి కమల్‌, సోదరి అక్షర హాసన్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Day one !!! #shooting #family #movies #losangeles

A photo posted by @shrutzhaasan on Jun 6, 2016 at 12:24pm PDT

దీంతోపాటు ఒక గొప్ప కొరియోగ్రాఫర్‌తో పనిచేస్తున్నానంటూ జమాల్‌ సిమ్స్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు.

Working with one of the most awesome choreographers ever!!!! @jamizzi

A photo posted by @shrutzhaasan on Jun 6, 2016 at 12:32pm PDT

రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టి.కె. రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సుమారు 27 సంవత్సరాల ముందు మలయాళంలో 'చాణక్యన్‌' అనే సినిమా ద్వారా దర్శకుడు రాజీవ్‌కుమార్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో చిత్రం రాలేదు. తమిళంలో కూడా కనిపించలేదు.

Dalit association files complaint against Kamal Haasan’s Sabash Naidu

కానీ తొలిసారిగా తమిళంలో ప్రస్తుతం వీరు 'శెభాష్‌ నాయుడు' పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అంతేకాకుండా చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు.

కమల్ హాసన్ సినిమా ప్రారంభం రోజే వివాదం లో చిక్కకుంది. తమిళనాడులోని ఓ దళిత సంఘం వారు టైటిల్ మార్చాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఒక కులం పేరు సినిమాకు పెట్టడం ద్వారా మిగతా కులాలను తక్కువ చేసినట్లు ఉంటుందని వారు వాదిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే తాము ధర్నాలకు దిగాల్సివస్తుందని హెచ్చరించారు.

English summary
Association for Progress of Tamil Nadu Arunthathiyar has filed a complaint against Kamal Haasan’s movie Sabash Naidu at the collector’s office in Coimbatore.In the petition, the association has asked the collector to stall the shooting of the movie. They alleged that the movie only promotes one caste over the others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu