»   » ‘ఢమరుకం’ 50 డేస్....లాభాలా? నష్టాలా?

‘ఢమరుకం’ 50 డేస్....లాభాలా? నష్టాలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కింగ్ నాగార్జున హీరోగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డాక్టర్ వెంకట్ నిర్మించిన సోసియో ఫాంటసీ చిత్రం 'ఢమరుకం'. తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'నేను చేసిన మొట్ట మొదటి సోషియో ఫాంటసీ చిత్రమిది. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా అన్ని తరగతుల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. ఈచిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు' అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'నా కెరీర్ కి డమరుకం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. నాగార్జున కెరీర్లోనే డమరుకం చిత్రాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిపి సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, నాగార్జున అభిమానులకు నా కృతజ్ఞతలు' అన్నారు.

సహ నిర్మాత వి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ 'మా బేనర్‌లో నాగార్జున గారితో చేసిన ఢమరుకం పెద్ద హిట్ అయింది. విడుదలైన అన్ని చోట్ల నాగార్జున కెరీర్లోనే హయ్యెస్ట్ షేర్స్ సాధించినందుకు హ్యాపీగా ఉంది' అన్నారు. చిత్ర సమర్పకులు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ '2012లో వరుసగా బిజినెస్ మేన్, పూలరంగడు, లవ్ లీ, శ్రీమన్నారాయణ, డమరుకం...ఈ ఐదు విజయాలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌కు దక్కడం చాలా ఆనందంగా ఉంది' అన్నారు.

నిజంగానే డమరుకం లాభాలు తెచ్చిందా?
నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన డమరుకం చిత్రం నిజంగానే నిర్మాతలకు లాభాలు తెచ్చిందా? అంటే లేదనే వాదన వినిపిస్తోంది ట్రేడ్ వర్గాల నుంచి. సినిమా అనుకున్న దానికంటే ఆలస్యంగా విడుదలవ్వడం ఓ కారణమైతే, సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు అధికారికంగా కలెక్షన్ల వివరాలు బయట పెడితే తప్ప ఈ వాదనలో నిజం ఎంతో తేలే అవకాశం లేదు.

English summary
Damarukam completes 50 days. Damarukum is a socio-fantasy film with more than 40 minutes of extraordinary graphical work by Hollywood technician team. This is the highest budget film in Nagarjuna's career till date.
Please Wait while comments are loading...