twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: 'ఢమరుకం' విడుదల వాయిదా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలు ప్రకటించి మళ్లీ వాయిదా వేస్తూ వస్తున్న చిత్రం మరోసారి ఫోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ నెల 19న విడుదల ప్లాన్ చేసిన ఈ చిత్రం మరోరోజు ముందుకు వెల్లి 20 వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ ఖరారు చేసి తెలిపారు. అలాగే ఈరోజు చిత్రం సెన్సార్ పూర్తి అయ్యి U/A సర్టిఫికేట్ పొందింది. గ్రాఫీక్స్ తో అద్బుతంగా రూపొందిన ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో విడుదల చేస్తున్నామన్నారు. అనుష్క హీరోయిన్ గా చేసిన ఈ చితానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... ''మమ్మీ, యుగాంతం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహా కథ ఇది. నా కెరీర్‌లో ఇదో ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం అందించాడు. పొద్దున్న ఓ పాట, కోపంగా ఉన్నప్పుడు మరోపాట, నిద్రపోయే ముందు ఓ పాట వినొచ్చు. ఈ సినిమా బాగా వచ్చిందంటే కారణం.. వెంకట్‌. తొమ్మిది నెలల పాటు కేవలం గ్రాఫిక్స్‌ కోసమే కష్టపడ్డారు. ఈ సినిమాలో నేను తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడా. సినిమా చేస్తున్నంతసేపూ 'హలో బ్రదర్‌' గుర్తొచ్చింది'' అన్నారు .

    అలాగే '' 'మాయాబజార్‌'లో ఎస్వీ రంగారావు పాత్రంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో రవిశంకర్‌ అలాంటి పాత్రలో కనిపిస్తాడు. ఛార్మి నా లక్కీ కథానాయిక. ఆమెతో పనిచేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ దసరాకి చాలా సినిమాలొస్తున్నాయి. అవన్నీ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా నాకు సంబంధించినంత వరకూ ఈ సినిమాలో ఇద్దరు స్టార్లున్నారు. ఒకరు నిర్మాత. మరొకరు సంగీత దర్శకుడు. సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం అహర్నిశలూ కష్టపడ్డారు. ఇండియన్‌ అవతార్‌గా భావించి ఈ సినిమాను తీర్చిదిద్దారు'' అన్నారు .

    '''సక్కుబాయి' అనే ఐటం సాంగ్ లో నర్తించిన ఛార్మి మాట్లాడుతూ ''ఈ పాట విన్నప్పటి నుంచీ అందరూ నన్ను సక్కుబాయ్‌ అనే పిలుస్తున్నారు. దేవిశ్రీ పాటల్లో కావల్సినంత హుషారు ఉంటుంది. నటీనటులెవరైనా ఐదు శాతం చేస్తే చాలు. నాగ్‌ నా అదృష్ట కథానాయకుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది'' అని చెప్పింది. ''కన్యాకుమారి, సక్కుబాయ్‌ పాటలు మాస్‌ కోసం చేసినవి. ఆ పాటలు అందరికీ నచ్చాయి. ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి సన్నిహితుడు. ఈ సినిమాని ఆయన చక్కగా తీర్చిదిద్దార''ని దేవిశ్రీ చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''మూడు సంవత్సరాల నిర్విరామ కృషి ఈ సినిమా. కథ కోసం పద్దెనిమిది నెలలు కష్టపడ్డాం. శిల్పంలా తీర్చిదిద్దాం. దేవిశ్రీ ప్రసాద్‌తో పనిచేయగలనా? అనిపించింది. ఈ సినిమా ఆ అవకాశాన్ని కల్పించింది'' అన్నారు. ''ప్రతి సాంకేతిక నిపుణుడూ ఓ తపస్సులా భావించి ఈ సినిమా కోసం పనిచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు తీయగల సత్తా.. మనకూ ఉందని నిరూపిస్తుంది డమరుకం'' అన్నారు చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి.

    English summary
    
 Nagarjuna's Damarukam was cleared by Censor Board. The film got U/A certification with no major cuts suggested. This graphical extravaganza is getting released in grand way on October 20th. Producer R Venkat confirmed that the film was done censors today and would release next weekend. Anushka Shetty is the heroine in this film which is being directed by Srinivas Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X