twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దగ్గుపాటి రానా కి సవాల్ విసురుతున్న నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం 20 న విడుదల తేదీ ప్రకటించాక మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో సారి వాయిదా పడకూడదని ఎట్టి పరిస్దితుల్లోనూ అదే డేట్ ని ఫిక్స్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే అదే రోజున రానా తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురం కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరి ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.

    'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

    దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా లేటు అవటంతో రిలీజ్ ని మార్చారు. క్రిష్ ఈ చిత్రం విషయమై మీడియాతో మాట్లాడుతూ...''సమాజంలోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడం మర్చిపోలేదు. బీటెక్‌ బాబు, దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. '' అన్నారు.

    ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు,కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది. ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రానా ధియోటర్ ఆర్టిస్టుగా,స్వార్ద పరుడుగా కనపిస్తే...నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రానా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్‌ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్‌. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.

    English summary
    Damarukam is that the Nagarjuna-starrer will release on November 9. The socio-fantasy entertainer was supposed to release long back but the unfinished VFX works has been prompting the makers to constantly push the release date. The Srinivas Reddy-directed film has some high-octane graphics, which will fascinate the audience it seems. Anushka will be playing Nag's romantic interest and Prakash Raj will be seen in an important role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X