For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘డమరుకం’ ప్రివ్యూ... (ఫోటోలతో)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నాగార్జున హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' చిత్రం కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ. 40 కోట్లు ఖర్చు చేసి ఈచిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 25, 2011లో ప్రారంభమైన ఈచిత్రం షూటింగ్ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల కావడానికి దాదాపు సంవత్సరన్నర సమయం పట్టింది.

  డమరుకం చిత్రం కథ ఆటో డ్రైవర్ మల్లిఖార్జున(నాగార్జున) చుట్టూ తిరుగుతుంది. కొన్ని అతీత శక్తులు గల అమ్మాయి(అనుష్క)ని మల్లిఖార్జున ప్రేమిస్తాడు. ఆ శక్తులను వశం చేసుకోవడానికి విలన్(రవి శంకర్) ఆమెను చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఆమెను ప్రేమిస్తున్న మల్లిఖార్జున కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. మరి శివుడికి, కైలాసానికి, వీరికి ఏమిటం సంబంధం అనే విషయాలు ఆ తర్వాతి స్టోరీ.

  డమరుకం చిత్రానికి నాగార్జున పెర్ఫర్మెన్స్ హైలెట్ గా నిలవనుంది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పుకొచ్చారు.

  సినిమాకు మరో హైలెట్ స్పెషల్ ఎఫెక్ట్స్, విజువల్ గ్రాఫిక్స్. సినిమాలో దాదాపు 70 నిమిషాల పాటు ఉన్న గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజిలో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయట.

  దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి హిట్టయింది. అందమైన చిత్రాల్లో చిత్రీకరించిన ఈ పాటలు సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

  అనుష్క అందాల ఆరబోత, నాగార్జునతో రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు ప్లస్సవుతాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.

  ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా అనే నవల ఆధారంగా 'డమరుకం' చిత్రాన్ని రూపొందించారు. పూర్తి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈచిత్రం సాగుతుంది. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ.

  డమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 9న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. మరిన్ని వివరాల కోసం పై ఫోటోలను క్లిక్ చేయండి.

  English summary
  Telugu movie Damarukam is a socio-fantasy movie and it is one of the most awaited movies in Telugu. This high-octane action flick is considered as the highest budget movie in the acting career of Nagarjuna and it has been made a whopping amount of Rs 40 crores. The shooting of the film began on April 25, 2011 and the film unit has taken more than one and half year to complete its production.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X