twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డమరుకం’ మాదే: తెలంగాణ చాంబర్ సభ్యులు ధర్నా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: డమరుకం చిత్రాన్ని వివాదాలు వీడటం లేదు. తాజాగా ఈచిత్రం టైటిల్ పై వివాదం నెలకొంది. డమరుకం టైటిల్ తమనే అంటూ 'తెలంగాణ ఫిల్మ్ చాంబర్' సభ్యులు ఫిల్మ్ చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు 'డ' బదులు 'ఢ' తగిలించి 'డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

    డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.

    నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం 'ఢమరుకం' ఈనెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, దర్శకత్వం : శ్రీనివాసరెడ్డి.

    మరో వైపు నాగార్జున తొలిసారిగా ఒక మహిళా దర్శకురాలితో కలిసి పని చేయబోతున్నారు. ఇటీవల 'లవ్ లీ' వంటి కమర్షియల్ చిత్రాన్ని తీసి, హిట్ కొట్టిన బి.జయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయింది, ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోంది.

    English summary
    Damarukam movie title controversy: Telangana film chamber members held dharna at AP film chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X