For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్చ్...‘డమరుకం’ రిలీజ్ డేట్ మళ్లీ మారింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తున్న 'డమరుకం' రిలీజ్ డేట్ మరోసారి మారింది. ఈ నెల 9న ప్రజల ముందుకొస్తుంది అని పోస్టర్స్ పడి, టిక్కెట్స్ అమ్ముడైన ఈ సమయంలో ఒక రోజు ముందుకు రిలీజ్ వెళ్లింది. అంటే ఈ చిత్రం నవంబర్ 10న విడుదల అవుతోంది. కొన్ని ఫైనాన్సియల్ సెటిల్ మెంట్స్ వల్ల చిత్రం విడుదల లేటు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంపై మాత్రం అంచనాలు అధికంగా ఉన్నాయి. అంచనాలను ఖచ్చితంగా అందుకుంటుందని చెప్తున్నారు.

  నాగార్జున ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో అత్యధిక ఖర్చుతో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం అందుకే నాగ్ అభిమానులకే కాకుండ సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా రిలీజ్‌కోసం వేచివున్నారు. కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా వున్న శ్రీనివాసరెడ్డి తొలిసారి 'నాగ్-అనుష్క' వంటి స్టార్స్ కలయికలో ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం ఒక సవాల్‌గా కూడా నిలిచింది. ఇప్పటికే నాగార్జున దర్శకుడు శ్రీనివాసరెడ్డిని అభినందిస్తూ ఈ సినిమా తర్వాత అతనికి చాలామంచి పేరు వస్తుందని, అంతబాగా ఈ చిత్రాన్ని ఆయన మలిచాడని పేర్కొన్నారు.

  దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత వెంకట్ డమరుకం గురించి మాట్లాడుతూ-''అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఊహలకు అందని స్థాయిలో కథా, కథనం ఉంటుంది. ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళ్లే విధంగా ఇందులో గ్రాఫిక్స్ వర్క్ ఉంది. దర్శకునిగా శ్రీనివాసరెడ్డిలోని మరోకోణం ఈ సినిమా అని చెప్పొచ్చు. నాగార్జున చేసే సాహసాలు, అనుష్క అందాలు, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఇతర శాఖల పరంగా కూడా గొప్పగా ఉంటుంది ఈ సినిమా. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించిన 'డమరుకం' సంచలన విజయం సాధిస్తుందని చెప్పగలను'' అన్నారు.

  'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

  ఈ విభిన్న చిత్రానికి కథను వెలిగొండ శ్రీనివాస్, కెమెరా పనితనాన్ని చోటా కె.నాయుడు అందించారు. వి.సురేష్‌రెడి సహ నిర్మాణంలో, కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు.

  English summary
  Since a week, the production team has been insisting that Damarukam film will hit the screens on 9th. But we have just received official confirmation that the movie is now being postponed to 10th. The movie has Akkineni Nagarjuna and Anushka in the lead roles and Srinivasa Reddy is the director. The movie has been produced by Venkat on R.R.Movie Makers banner and Devi Sri has scored the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more