For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ న్యూస్ : 'డమరుకం' 10న రిలీజ్ లేదు

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం విడుదల తేదీలు ఇప్పటికీ చాలా మారాయి. అయితే నవంబర్ 10న ఖచ్చింతగా విడుదల చేస్తామని నిర్మాతలు ఖరారు చేసారు. అయితే అభిమానులను నిరాసపరుస్తూ ఈ చిత్రం రేపు విడులకాకుండా మరో వాయిదాకి వెళ్ళుతోంది. అయితే కొత్త విడుదల తేదీ ఏమిటనేది తెలియలేదు. ఇప్పటికే థియేటర్ల వద్ద అమ్మేసిన టిక్కెట్లను రిఫెండ్ చేస్తారని తెలుస్తోంది.

  Dhamarukam

  నాగార్జున చిత్రం గురించి గతంలో మాట్లాడుతూ...దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న బంధం చుట్టూ 'డమరుకం' కథ అల్లుకొని ఉంటుంది. దీంట్లో ఉన్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. మనవైన ఆచారాలు, సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగా ఇందులో చెబుతున్నాం. నాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

  తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

  నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి ఓ రేంజిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్ ని హరి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు డిమాండ్ తెచ్చి పెట్టింది.

  విడుదలకు ముందే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

  English summary
  Nagarjuna’s ‘Damarukam’ has been postponed again. The film is not releasing tomorrow and a new date maybe announced soon. Trade sources say that patrons who have booked tickets may approach the respective theaters for a refund.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X