twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టకేలకు 'డమరుకం'విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొత్తానికి నాగార్జున అబిమానులు శివుడుకి చేసిన ప్రార్ధనలు ఫలించాయి. నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం 'డమరుకం'చిత్రం అన్ని అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్దమవుతోంది. దసరా సంబరాల్లో వస్తుందని,దీపావళికి వస్తుందని ఊరించి ఆగిపోయిన 'డమరుకం' ఎట్టకేలకు విడుదల అవుతోంది. ఈ నెల 23 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు ధ్రువీకరించారు. విడుదల తేదీ తో పోస్టర్స్ విడుదల చేసారు. నవంబర్ 23..నాగచైతన్య పుట్టిన రోజు కావటం విశేషం.

    'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

    ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైథిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు.

    ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

    English summary
    
 The tension of Nagarjuna and his fans is over. Film industry sources say that the producer of the film has surmounted the financial hitches and finally made preparations for release of the much hyped and expected film on November 23.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X