»   »  నాగ్ 'డమరుకం' కి చిరు 'అంజి' కి దగ్గర పోలికలు

నాగ్ 'డమరుకం' కి చిరు 'అంజి' కి దగ్గర పోలికలు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం అప్పట్లో వచ్చిన చిరంజీవి 'అంజి' చిత్రం ని గుర్తు చేస్తోందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఏమిటి ఈ రెండు సినిమాల మధ్య పోలిక అంటే.. ఈ రెండూ సోషియో ఫాంటసీ చిత్రాలు కావటం. రెండు చిత్రాల కథలూ శివుడు చుట్టూ తిరుగుతాయి. రెండు చిత్రాలూ అద్బుతమైన VFX గ్రాఫిక్స్ తో నిండి ఉండటం, అలాగే రెండు చిత్రాలు విడుదల బాగా లేటు అవటం జరుగుతోంది. అంతేకాక షూటింగ్ పూర్తయ్యాక అంజిలో ..రీమా సేన్ ఐటం సాంగ్ కలిపారు. ఈ చిత్రం లోనూ ఛార్మి ఐటం సాంగ్ ని జత చేసారు. అయితే రిజల్ట్ విషయంలో ఈ రెండు చిత్రాలకూ పోలిక ఉండకపోవచ్చని అంటున్నారు. 'డమరుకం' కి మంచి క్రేజ్ వచ్చిందని ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు.

  ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...''నాకు సంబంధించినంత వరకూ ఈ సినిమాలో ఇద్దరు స్టార్లున్నారు. ఒకరు నిర్మాత. మరొకరు సంగీత దర్శకుడు. సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం అహర్నిశలూ కష్టపడ్డారు. ఇండియన్‌ అవతార్‌గా భావించి ఈ సినిమాను తీర్చిదిద్దారు'' అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'డమరుకం'. అనుష్క హీరోయిన్. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

  అలాగే ''మమ్మీ, యుగాంతం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహా కథ ఇది. నా కెరీర్‌లో ఇదో ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి సంగీతం అందించాడు. పొద్దున్న ఓ పాట, కోపంగా ఉన్నప్పుడు మరోపాట, నిద్రపోయే ముందు ఓ పాట వినొచ్చు. ఈ సినిమా బాగా వచ్చిందంటే కారణం.. వెంకట్‌. తొమ్మిది నెలల పాటు కేవలం గ్రాఫిక్స్‌ కోసమే కష్టపడ్డారు. ఈ సినిమాలో నేను తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడా. సినిమా చేస్తున్నంతసేపూ 'హలో బ్రదర్‌' గుర్తొచ్చింది. 'మాయాబజార్‌'లో ఎస్వీ రంగారావు పాత్రంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో రవిశంకర్‌ అలాంటి పాత్రలో కనిపిస్తాడు. ఛార్మి నా లక్కీ కథానాయిక. ఆమెతో పనిచేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని నాగార్జున చెప్పారు.

  'సక్కుబాయి' అనే ప్రత్యేక గీతంలో నర్తించిన ఛార్మి మాట్లాడుతూ ''ఈ పాట విన్నప్పటి నుంచీ అందరూ నన్ను సక్కుబాయ్‌ అనే పిలుస్తున్నారు. దేవిశ్రీ పాటల్లో కావల్సినంత హుషారు ఉంటుంది. నటీనటులెవరైనా ఐదు శాతం చేస్తే చాలు. నాగ్‌ నా అదృష్ట కథానాయకుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది'' అని చెప్పింది. ''కన్యాకుమారి, సక్కుబాయ్‌ పాటలు మాస్‌ కోసం చేసినవి. ఆ పాటలు అందరికీ నచ్చాయి. ఈ చిత్ర దర్శకుడు నాకు మంచి సన్నిహితుడు. ఈ సినిమాని ఆయన చక్కగా తీర్చిదిద్దార''ని దేవిశ్రీ చెప్పారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''మూడు సంవత్సరాల నిర్విరామ కృషి ఈ సినిమా. కథ కోసం పద్దెనిమిది నెలలు కష్టపడ్డాం. శిల్పంలా తీర్చిదిద్దాం. దేవిశ్రీ ప్రసాద్‌తో పనిచేయగలనా? అనిపించింది. ఈ సినిమా ఆ అవకాశాన్ని కల్పించింది'' అన్నారు. ''ప్రతి సాంకేతిక నిపుణుడూ ఓ తపస్సులా భావించి ఈ సినిమా కోసం పనిచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాలు తీయగల సత్తా.. మనకూ ఉందని నిరూపిస్తుంది డమరుకం'' అన్నారు చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి.

  English summary
  Chiranjeevi's 'Anji', 'Damarukam'...Both movies are having same concept of Lord Shiva as central theme, a love story, stunning VFX and a same kind of delay in release. Damarukam makers added an item Song on Charmi after completing total movie shoot, exactly which was done by Anji Makers with Reema Sen earlier. If we have to take trade reports into consideration, Anji is a average performer for distributors and loss venture for producers. This angle is said to be now worrying Damarukam producers, RR Makers, an injured bird in Telugu industry.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more