twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఢమరుకం’ మూవీ టాక్ ఏంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన నాగార్జున 'డమరుకం' చిత్రం ఈ రోజు ఎట్టకేలకు విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా టాక్ విషయానికొస్తే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. ఒకరకంగా ఈ చిత్రం ఓ మోస్తరు హిట్ సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.... స్కిప్టు వర్కు, నాగార్జున, రవిశంకర్ పెర్ఫార్మెన్స్, సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అయితే క్లైమాక్స్ ఆసక్తి కరంగా లేక పోవడంతో ప్రేక్షకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. స్క్రీన్ ప్లే కూడా పర్ ఫెక్టుగా లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. టెక్నికల్ అంశాల పరంగా సినిమా ఓకే. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి.

    వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ.

    డమరుకం చిత్రం కథ ఆటో డ్రైవర్ మల్లిఖార్జున(నాగార్జున) చుట్టూ తిరుగుతుంది. కొన్ని అతీత శక్తులు గల అమ్మాయి(అనుష్క)ని మల్లిఖార్జున ప్రేమిస్తాడు. ఆ శక్తులను వశం చేసుకోవడానికి విలన్(రవి శంకర్) ఆమెను చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఆమెను ప్రేమిస్తున్న మల్లిఖార్జున కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. మరి శివుడికి, కైలాసానికి, వీరికి ఏమిటం సంబంధం అనే విషయాలు ఆ తర్వాతి స్టోరీ.

    English summary
    ‘Damarukam' is finally released all over the world today. It is a socio-fantasy movie directed by Srinivas Reddy on R R Movie Makers banner. The movie gets hit talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X