twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ దే తీసుకున్నానని ఒప్పుకున్న వర్మ

    By Srikanya
    |

    ''నిజమే 'డన్‌ డన్‌ డనా' అనేది తమిళ పాట నుంచి స్ఫూర్తి పొందినదే. రజనీకాంత్‌ డాన్స్ చేసిన 'ఆశై నూరు...' అనే పాట నాకెంతో ఇష్టం. అందుకే దాన్ని తీసుకొన్నాం. నేను షూట్ చేసిన శైలి నాటి రజనీ పాటకు నీరాజనం లాంటిది. అయినా మొత్తం బాణీని తీసుకోలేదు. మొదటి 30 సెకన్ల బాణీనే స్ఫూర్తిగా ఎంచుకొన్నాం'' అన్నారు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ తాజాగా యూ ట్యూబ్ లో విడుదల చేసిన 'డిపార్ట్‌మెంట్‌'ఐటం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదమైంది. రజనీకాంత్‌ నటించిన 'అడుత్తు వారిసు' అనే చిత్రంలో 'ఆశై నూరు వగై...' అనే పాట ట్యూన్ ని కాపి కొట్టి వదిలాడంటూ అందరూ గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో నిజమే తాను ఆ పాట నుంచే తీసుకున్నానని ఒప్పుకుంటూ ప్రకటన చేసారు.

    అలాగే ...''ఇప్పటి వరకూ నేను తీసిన ఐటమ్ సాంగ్ లలో గొప్పది... 'డన్‌ డన్‌ డనా'. డిపార్ట్‌మెంట్‌లో నథాలియా కౌర్‌పై చిత్రించాను'' అని చెప్పారు వర్మ. ఈ పాటని'డిపార్ట్‌మెంట్‌' సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సంజయ్‌దత్‌, రానా నటించారు. ఇందులో ఓ ఐటం సాంగ్ ఉంది. నథాలియా కౌర్‌ అనే బ్రెజిల్‌ మోడల్‌ ఆ పాటకు డాన్స్ చేసింది. నథాలియా కౌర్‌ అందం, నృత్యం గురించి వర్మ కొద్ది రోజులుగా పొగుడుతూనే ఉన్నారు. ఇటీవలే ముంబైలో ఆ పాటను, అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

    'డన్‌ డన్‌ డనా చీనీ...' అంటూ సాగే ఈ పాట జానపద బాణీలో సాగుతుంది. ఈ ఐటం సాంగ్ ముప్ఫై సంవత్సరాల కిందట వచ్చిన ఆ తమిళ పాటను పోలి ఉంది. రజనీకాంత్‌ నటించిన 'అడుత్తు వారిసు' అనే చిత్రంలో 'ఆశై నూరు వగై...' అనే పాట ఉంది. మలేసియా వాసుదేవన్‌ పాడిన ఆ గీతం ఇప్పటికీ తమిళనాడులో వినిపిస్తూనే ఉంటుంది. ఆ బాణీనే బాలీవుడ్‌కి ఇప్పుడు వర్మ తీసుకువెళ్లారు. వర్మ 'డన్‌ డన్‌...'ను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆ పోలికను కనిపెట్టారు అభిమానులు.

    డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు. విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.

    English summary
    Ram Gopal Varma has confirmed speculations that 'Dan Dan' is inspired by 'Aasai Nooruvagai', the track composed by Ilayaraja and picturised on the Tamil superstar. "To answer all speculations yes Nathalia Kaur dan dan song has been inspired from Rajinikanth's song aasai nooruvagai from his film 'Adutha Varisu'. The inspiration rights have been taken.. that Rajinikanth song has been one of my all time faviourates and Nathalia Kaur song is a tribute to it, Varma posted on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X