»   » మూడో ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ ఆడియో (ఫోటోస్)

మూడో ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ ఆడియో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో తెరకెక్కబోతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ'. జే.వి.ఆర్ దర్శకుడు. సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు మాస్టర్ నందమూరరి తారక రామారావు, సౌమిత్రి ఈ చిత్రం ద్వారా బాల నటులుగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే నందమూరి ఫ్యామిలీలో సినీయర్ ఎన్టీఆర్, జూ ఎన్టీఆర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇపుడు ఈ బాల ఎన్టీఆర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి కౌసల్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాద్ లోని తాజ్ బంజారాలో బుధవారం సాయంత్రం జరిగింది.

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్ శిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఎన్టీఆర్, మాస్టర్ సౌమిత్రి, విజయ్ రామారావు, పరుచూరి గోపాల కృష్ణ, సి కళ్యాణ్, కెఎస్ రామారావు, కొడాలి వెంకటేశ్వరరావు, బాబు మోహన్, తుమ్మలపల్లి సత్యనారాయణ, ఆర్ పి పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, వివరాలు...

నందమూరి వంశంలో పుట్టడం అదృష్టమే

నందమూరి వంశంలో పుట్టడం అదృష్టమే


నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఏ జన్మలో అదృష్టమో కానీ నందమూరి వంశంలో పుట్టాం. మమ్మల్ని అదరిస్తున్న ప్రేక్షకులు, దర్శక నిర్మాతలకు థాంక్స్. మమ్మలి ఆదరించినట్లే బాల ఎన్టీఆర్, సౌమిత్రిలను ఆదరించాలని కోరుకుంటున్నాను. పిల్లలతో ఇంత గొప్ప సినిమా తీసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అన్నారు.

జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ..

జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ..


బాలగోపాలుడితో అన్నయ్య కళ్యాన్ రామ్, రామాయణంతో నేను బాలనటులుగానే పరిచయం అయ్యాం. నాన్న, బాబాయ్ అందరూ బాలనటులుగానే పరిచయం అయ్యాం. ఇపుడు నాలుగోతరం నటులు కూడా బాలనటులుగటా పరిచయం అవుతున్నారు. ఈ ప్రయత్నం చేసిన నిర్మాతలకు అభినందనలు. అన్నారు.

అన్నయ్య జానకిరమ్ గురించి ఎన్టీఆర్

అన్నయ్య జానకిరమ్ గురించి ఎన్టీఆర్


పిల్లలతో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. తాతయ్య, అన్న జానకిరామ్ ఆశీస్సులు అందరిపై ఉంటాయి. ఈ రోజు అనయ్య జానకిరామ్ మా మధ్య ఉంటే బావుండేది. ఆయన భౌతికంగా లేక పోయినా మన మధ్యే ఉన్నారు అన్నారు.

నిర్మాత బాలరాజు మాట్లాడుతూ..

నిర్మాత బాలరాజు మాట్లాడుతూ..


నేను ఈ సినిమా కోసం జానకిరామ్ గారికి ఫోన్ చేసి అడిగితే మా అబ్బాయి పుట్టినరోజు నాడు మా తాతగారి ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చిందనకుంటున్నాను. రెమ్యూనరేషన్ కూడా వెయ్యి నూట పదహార్లు ఇస్తే చాలు అన్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే ఇదే కృష్ణుడితో మాయా బజార్ చేయాలని ఉంది అన్నారు.

సంగీత దర్శకురాలు కౌసల్య మాట్లాడుతూ..

సంగీత దర్శకురాలు కౌసల్య మాట్లాడుతూ..


దాన వీర శూర కర్ణ ఒక మహత్తర కార్యం. ఈ సినిమా చిన్న పిల్లలతో చేయడం, ఆ సినిమాకు నేను సంగీత చేయడం ఆ అదృష్టంగా భావిస్తున్నాను అని కౌసల్య అన్నారు.

నందమూరి హీరోలు...

నందమూరి హీరోలు...


ఆడియో వేడుక వద్ద నందమూరి హీరోల పోస్టర్లు ఇలా...

English summary
Dana Veera Soora Karna audio launch held at Taj Banjara Hotel in Hyderabad on Wednesday (06th May) evening.
Please Wait while comments are loading...