పవన్ CGTR: నిర్మాత ఆశ, విద్యార్థుల ఆందోళన

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో..ముఖ్యంగా యూఎస్‌లో క్రేజ్ ఏమిటో 'గబ్బర్ సింగ్' చిత్రంతో రుజువైంది. ఆ చిత్రం అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య యూఎస్‌లో తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారీగా లాభాలు వస్తాయనే ఆశతోనే దానయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

కాగా....కెమెరామెన్ గంగతో షూటింగ్ పాతబస్తీలోని సిటీ కాలేజీలో వేసిన హాస్పిటల్ సెట్‌లో జరుగుతుండగా కొంత మంది విద్యార్థి నాయకులు షూటింగును అడ్డుకున్నారు. చారిత్రాత్మకమైన ఈ కాలేజీ శిథిలావస్థకు చేరుకుందని, ఈ కట్టడాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా షూటింగులకు అద్దెకివ్వడం ఏమిటని ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో తాత్కాలికంగా చిత్రం షూటింగ్ నిలిపి వేశారు.

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X