twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాన్స్ మాస్టర్ రమేష్ అధ్వర్యంలో డాన్స్ అండ్ ఫిట్ నెస్ స్టూడియో

    By Rajababu
    |

    నిత్యం పరుగులు పెట్టే నగర జీవితంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువని, అందుకే నగర ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. వ్యాయామాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ప్రగతినగర్ యూసుఫ్ గూడలో డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నడాన్స్ ఇన్ డాన్స్ ఫిట్ నెస్ స్టూడియోను తలసాని ప్రారంభించారు.

    అనంతరం తలసాని మాట్లాడుతూ....నగర వాతావరణం మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాలుష్యం బారిన పడుతున్నాం. మన జీవన శైలి ఒత్తిడితో కూడి ఉంటోంది. దీనికి తగినట్లే వ్యాయమాన్ని మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఫిట్ నెస్ స్టూడియోలు ఆరోగ్య కేంద్రాలుగా మారాలి. అని అన్నారు.

    Dance master Ramesh started Fitness studio

    డాన్స్ ఇన్ డాన్స్ స్టూడియో నిర్వాహకులు మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్ గా చిత్ర పరిశ్రమతో నాకు 20 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలకు పనిచేస్తూనే డాన్స్ ఫిట్ నెస్ స్టూడియోలు నిర్వహిస్తున్నాను. మా ప్రధాన శాఖ ఎస్ ఆర్ నగర్ లో ఉంది. ప్రస్తుతం ప్రగతి నగర్ యూసుఫ్ గూడలో కొత్త స్టూడియోను ప్రారంభించాం. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదుగా మా డాన్స్ స్టూడియో మొదలవడం సంతోషంగా ఉంది. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

    Dance master Ramesh started Fitness studio

    ప్రగతి నగర్ సమీపంలో ఇంత పెద్ద డాన్స్ స్టూడియో లేదు. మా డాన్స్ ఇన్ డాన్స్ స్టూడియోలో డాన్స్ తో పాటు ఫిట్ నెస్ కు ఉపయోగపడే ఏరోబిక్స్, జుంబా లాంటి అనేక నృత్య రీతుల్లో శిక్షణ ఇస్తాం. నిష్ణాతులైన నిపుణులు మా స్టూడియోలో అందుబాటులో ఉంటారు. అన్నారు.ఈ కార్యక్రమంలో చిన శ్రీశైలం యాదవ్, వినోద్ బాలా, కన్నారావు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు సత్య, జానీ, శేఖర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Film Choreographer, Dance master Ramesh started Fitness studio in Srinagar Colony. Minister Talasani Srinivas Yadav inaugarated the fitness studio. Srinivasa Yadav said that every fitness center should become health center.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X