»   » వరకట్నం కేసు: శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీలో కలకలం!

వరకట్నం కేసు: శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీలో కలకలం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ మధ్య పలువురు ప్రముఖ సినీ, రాజకీయ ఫ్యామిలీల విషయంలో వరకట్నం వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ విషయంలో తాజాగా ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివ శంకర్ ఫ్యామిలీ కుటుంబం చెన్నైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

శివ శంకర్ మాస్టర్.... పెద్ద కుమారుడు విజయ్ కృష్ణ భార్య జ్యోతి తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ 498ఎ కేసు పెట్టినట్లు సమాచారం. అయితే శివ శంకర్ మాస్టర్ కుటుంబం మాత్రం ఆస్తి కోసమే తమను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తమకు ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.

తన భార్య చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆమె నెగెటివ్ గా ఆలోచిస్తోందని, అనవసర రాద్దాంతం చేస్తోందని, ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్దమే అని, పాప కోసం ఆమెతో కలిసి ఉండేందుకు సిద్ధమే అని విజయ్ కృష్ణ తెలిపారు.

Dance Master Shiva Sankar Claims Daughter-in-law Torture us Demanding 10 Crores

కలిసుందాం అని అంటున్న వారు తనకు ఇంట్లో చోటు ఎందుకు ఇవ్వడం లేదని కోడలు జ్యోతి ప్రశ్నిస్తోంది. తనను కావాలని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో్ జయలలిత జోక్యం చేసుకోవాలని ఆమె తెలిపారు.

ఈ ఆరోపణలపై శివశంకర్ మాస్టర్ స్పందిస్తూ... 'తన పేరు చెడగొట్టేందుకే ఆమె ఇలా చేస్తోందని, తన ఆస్తులపై కన్నేసి లేని పోని ఆరోపణలు చేస్తోందని, ఆమె వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఒక అమ్మాయి జీవితం పాడు చేయడాలనుకునే ఉద్దేశ్యం తమకు లేదు. తమను రూ. 10 కోట్లు ఇవ్వాలంటూ టార్చర్ పెడుతోందని' ఆరోపించారు.

English summary
Dance Master Shiva Sankar Claims Daughter-in-law Torture us Demanding 10 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu