»   » ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘దండుపాళ్యం-4’

ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘దండుపాళ్యం-4’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘దండుపాళ్యం-4’

  దండుపాళ్యం సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. త్వరలో దండుపాళ్యం-4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి 'దండుపాళ్యం' మొదటి,రెండు,మూడు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందుతోంది.

  ప్రధాన పాత్రలో సుమ రంగనాధన్

  ప్రధాన పాత్రలో సుమ రంగనాధన్

  సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దండును తయారు చేసే పాత్తను బెనర్జీ పోషించారు. వెంకట్ మూవీస్ పతాకంపై కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  దండును తయారు చేసే పాత్రలో బెనర్జీ

  దండును తయారు చేసే పాత్రలో బెనర్జీ

  ఈ చిత్రంలో దండు ను తయారు చేసే నాయకుడి గా ప్రధాన పాత్రలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'బెనర్జీ' నటిస్తున్నారు. ఇప్పటికే తాను ఈ చిత్రం లో పోషిస్తున్న పాత్ర షూటింగ్ పూర్తయిందని, నటుడిగా తనకిదో వైవిధ్యమైన పాత్ర అని బెనర్జీ తెలిపారు. గత చిత్రాలకన్నా భిన్నంగా 'దండుపాళ్యం-4' రూపొందుతోందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రం లో తమ దండు చేసే పోరాటాలు,తన పాత్ర తో సహా, ఇతర ప్రధాన పాత్రలు, చిత్రం లోని సన్నివేశాలు, సంఘటనలు, వాతావరణం వాస్తవికతకు అద్దం పడతాయి. మంచి విజన్ వున్న దర్శకుడు కె.టి.నాయక్ . నిర్మాత వెంకట్ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పతాక సన్నివేశాలు ఎంతో ఉత్సుకతను కలిగిస్తాయి. నిస్సందేహంగా ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర ప్రశంసలకు గురవుతుందని ఆయన తెలిపారు.

  గ్యాంగ్ నాయకురాలిగా సుమ రంగనాథన్

  గ్యాంగ్ నాయకురాలిగా సుమ రంగనాథన్

  ఇందులో ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటిస్తున్నారు.. ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని దర్శకుడు చెప్పారు. 40 మంది గ్యాంగ్ లో ఎనిమిది మంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథకరచనతోనే ఈ సినిమా రూపొందుతోందని ఆయన వివరించారు. వైవిధ్యమైన పాత్రలను వెండితెరపై పోషించి తన ప్రతిభను చాటుకున్న సుమన్ రంగనాథన్ 'దండుపాళ్యం-4'లోనూ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు.పాత్ర నచ్చడం, కథలోని వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, సుమా రంగనాథన్ చెబుతున్నారు.

   'దండుపాళ్యం 4 ఐదు భాషల్లో విడుదల

  'దండుపాళ్యం 4 ఐదు భాషల్లో విడుదల


  దాదాపు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది, సెప్టెంబర్ లో దండుపాళ్యం-4' ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత వెంకట్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. ఎన్నో సరికొత్త ప్రదేశాలలో ఈ చిత్రం లోని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కెమెరామన్ గిరి ఈ చిత్రానికి ఓ ఎస్సెట్ అన్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని నిర్మాత కె.టి. నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు.

   తారాగణం, తెరవెనక

  తారాగణం, తెరవెనక

  చిత్రం లోని ప్రధాన తారాగణం: సుమన్ రంగనాధ్, బెనర్జీ, రాక్ లైన్ సుభాకర్, రామ్ దుర్గ, జీవ సిమన్, స్నేహ, రిచా శాస్త్రి , సంజీవ్, విఠల్, అరుణ్ బచ్చన్, రిచా శాస్త్రి, బుల్లెట్ సోము, స్నేహ.
  కెమెరా: ఆర్.గిరి, సంగీతం: ఆనంద్ రాజావిక్రమ్, ఎడిటర్: బాబు.ఎ. శ్రీ వాత్సవ్,ప్రీతి మోహన్, సాహిత్యం: భువనచంద్ర, నృత్యాలు: హరికృష్ణ.

  నిర్మాణ సంస్థ: వెంకట్ మూవీస్
  దర్శకత్వం: కె.టి.నాయక్
  నిర్మాత: వెంకట్

  English summary
  The producer of Dandupalyam 4, Venkat is planning to release the movie in five languages — Kannada, Telugu, Tamil, Malayalam, and Hindi. It features Sanjeev, who was a child artiste in My Autograph Sweet Memories, Vittal Ramdurga, theatre artistes Arun Bachchan and Rich Shastri, Bullet Somu and Sneha.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more