twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ కధను నా భార్య కూడా ఒప్పుకోలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్: కన్నడలో జరిగిన యధార్ధ ఘటనాధారంగా తీసిన చిత్రమే తప్ప సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చేది కాదు. మొదట ఈ కధను నా భార్య కూడా ఒప్పుకోలేదు.బేసిక్‌గా నాకూడా ఇష్టంలేదు. సమాజంలో ఇలాంటి వాళ్లుకూడా వుంటారా అన్నదే చూపించాం. కంటెంట్‌ కొత్తగా వున్నాదనే వుదేశంతోనే చేశాను.ఇప్పుడు ఈ కధను తీయకపోతే ఎప్పటికి తీయలేను అన్నారు దర్శకుడు శ్రీను వారాజు.

    తెలుగులో వెంకట్‌ మూ వీస్‌ పతాకంపై శ్రీనువాసరాజు దర్శకత్వ లో వెంకట్‌ నిర్మించిన సినిమా దండుపాళ్యం. ఇది కన్నడ చిత్రానికి అనువాదరూపం. ఈ చిత్రం శుక్రవారం విడుదలైన సం దర్భంగా మీడియా పమావేశం ఏర్పాటు చేసారు. త్వరలో దండుపాళ్యం-2 చేస్తున్నారు. ఆ చిత్రం ఒక డ్రామా, పొలిటికల్‌ నేపధ్యంతో వుంటుంది న్నారు. ఇక పూజా గాంధీ మాట్లాడుతూ ''రొటీన్‌కు భిన్నంగా వుం డలనే ఈ పాత్ర చేశాను'' అన్నారు. మఖర్‌దేశ్‌ పాండే మాట్లాడుతూ... ఈ చిత్రంలో నన్ను పూర్తి వైవిధ్యమైన పాత్రలో చూపించారన్నారు.

    తమిళంలో 'కరిమేడు', మలయాళంలో 'తిరుట్టు గ్రామం' పేర్లతో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా బోజ్‌పురిలో కూడా ఈ సినిమాను అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ తారాగణంతో బాలీవుడ్‌లోకి ఈ సినిమాను రీమేక్ చేయనుండటం విశేషం. గోవా ఇండియా పనోరమాలో ప్రదర్శనకు అర్హత సంపాదించిన ఈ సినిమా సీక్వెల్ నిర్మాణానికి కూడా పలువురు కన్నడ నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నెలలోనే 'దండుపాళ్యం' చిత్రాన్ని విడుదల చేసి, 'దండుపాళ్యం-2' చిత్రాన్ని స్టార్ట్ చేస్తామని దర్శకుడు తెలిపారు.

    బెంగళూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం దండుపాళ్య. మానభంగాలు, వరుస హత్యలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాలను ఉక్కిబిక్కిరి చేసిన ఆ గ్రామంలో జరిగిన యధార్థ గాధ ఆధారంగా కన్నడంలో రూపొందించిన చిత్రం 'దండుపాళ్య'. బొమ్మాలి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే, నిషా కొఠారి, రఘు ముఖర్జి ఇందులో ప్రధాన పాత్రధారులు. తెలుగువాడైన శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకుడు.

    English summary
    With 'Dandupalya', director Srinivas set a trend in the Kannada industry by doing a different kind of a film without big stars. The latest report has shown that the film has witnessed numerous repeat audience. “Nobody can stop if the audience decides to make it a success,” he says confidently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X