»   » మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన దండుపాళ్యం. అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని సాధిచింది. ఈ చిత్రం తెలుగులో 10 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు శతదినోత్సవం కూడా జరుపుకొని సం చలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాష ల్లో ఇంతటి ఘన విజయం సాధించిన "దండుపాళ్యం" లో అప్పుడు ఉన్న టీమ్‌తోనే ఈ చిత్రానికి సీ క్వెల్‌గా "దండుపాళ్యం 2" చిత్రాన్ని నిర్మాత వెంకట్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.

ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా చాలా పెద్ద క్రేజ్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నా హాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ "దండు పాళ్యం 2 చిత్రం కోసం బెంగుళూర్‌లో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకు చాలా పెద్ద హైలైట్‌గా నిలుస్తాయి.

ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రాలుగా బాహుబలి 2, రోబో 2 వంటి సీక్వెల్స్ రూపొందుతున్న సమయంలోనే మా "దండుపాళ్యం 2" నిర్మాణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మొదటి పార్టు కంటే పెద్ద రేంజ్‌లో హిట్ అయ్యే విధంగా దర్శకుడు శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ఆగస్టులో మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ "మా చిత్రం కథ, కథనాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలను అద్భుతంగా ఆస్వాదించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు "దండుపాళ్యం 2" చిత్రం ఓ కొత్త అనుభూతినిస్తుంది" అని అన్నారు. బొమ్మాళి రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలె, పెట్రోల్ ప్రసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్‌జన్య.

మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

యథార్థ కథ: వరుస హత్యలు, మానభంగాలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాల్ని వణికించిన దండుపాళ్య గ్యాంగ్‌కు సంబంధించిన యథార్థ కథతో ఈ సినిమా రూపొందింది.

మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

మరోసారి హంతక పర్వం: ఆగస్టులో రానున్న దండుపాళ్యం-2 (ఫోటోస్టోరీ)

అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం: పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వెంకట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన దండుపాళ్యం. అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని సాధిచింది. ఈ చిత్రం తెలుగులో 10 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు శతదినోత్సవం కూడా జరుపుకొని సంచలనం సృష్టించింది.

సహజ నటన

సహజ నటన

అతి క్రూరమైన దండుపాళ్యం గ్యాంగ్ కథ ఇది. గొంతు కోసే సమయంలో వచ్చే శబ్దం కోసం ఒకతను 80 మందిని చంపేసిన కౄరమైన మనిషి ఈ గ్యంగ్ లో ఉంటాడు. ఈ పాత్ర చేసిన రఘు ముఖర్జీ నటన నిజమైన హంతకుడేనా అన్నంత సహజంగా ఉండి ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.

న్యూస్ ఆర్టికల్ ప్రేరణ

న్యూస్ ఆర్టికల్ ప్రేరణ

దండుపాళ్యం గ్యాంగ్ గురించి ఓ జర్నలిస్టు రాసిన ఆర్టికల్ తోనే ఈ చిత్రానికి కథా,స్క్రీన్ ప్లే రాసుకున్నారట.

పార్ట్-2

పార్ట్-2

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తూన్న దండుపాళ్యం-2 సిద్దమయ్యింది. త్వరలో ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

అదే టీం

అదే టీం

అప్పుడు ఉన్న టీం తోనే ఈ సీక్వెల్ పార్ట్ కూడా తీసారట.

దారుణం గా ఉంది

దారుణం గా ఉంది

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ఈ పార్ట్లోనూ మొదటి సినిమా స్థాయిలోనే వొళ్ళు జలదరించే సన్ని వేశాలతో ఉన్నట్టు అర్థమౌతోంది.

జైలు సెట్ కోటి రూపాయలు

జైలు సెట్ కోటి రూపాయలు

దండు పాళ్యం 2 చిత్రం కోసం బెంగుళూర్‌లో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకు చాలా పెద్ద హైలైట్‌గా నిలుస్తాయి..

బెంగుళూరు లోనే

బెంగుళూరు లోనే

ఇప్పటికే బెంగుళూరు పరిసర ప్రాంతాల్లోని వివిద ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేసారు. పూర్థిగా రియాలిటీకి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని నిర్మించారట.

ఈ ఆగస్టులోనె

ఈ ఆగస్టులోనె

ఆగస్టులో రానున్న ఈ సినిమా మొదటి భాగం లాగే...ఈ సారి కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.

విమర్షలు వచ్చినా

విమర్షలు వచ్చినా

మనిషిని పట్టుకొని గొంతు కోయటం,మానభంగాలూ, పోలీస్ థర్డ్ డిగ్రీని కూడా ఈ సినిమాలో మరీ కళ్ళకి కట్టినట్టు చూపించటం అప్పట్లో పలువిమర్షలకు దారి తీసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

English summary
"Dandupalyam 2" planning to release this movie in the month of August 2016 and it is completed shooting work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu