»   »  నా వయస్సు 16 సంవత్సరాలు... నన్ను క్షమించండి, రాజకీయాల్లో నన్ను ఇరికించొద్దు

నా వయస్సు 16 సంవత్సరాలు... నన్ను క్షమించండి, రాజకీయాల్లో నన్ను ఇరికించొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దంగల్‌ సినిమాలో నటించిన బాల నటి జైరా వజీమ్‌ సోమవారం సోషల్‌ మీడియాలో క్షమాపణ చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జైరా వజీమ్‌ సిఎం మెహబూబా ముఫ్తీతో శనివారం భేటీ అయ్యింది. జైరా తన చదువు, తదితర విషయాలను మెహబూబాతో ముచ్చటిం చింది. ముఫ్తీ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ జైరా వజీమ్‌ను రోల్‌ మోడల్‌గా అభివర్ణిస్తూ, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఈ వ్యాఖ్యలపై కొన్ని సెక్షన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఆమె రాజకీయ నాయకులను కలవడంపై సామాజిక మాధ్యమాలలో కూడా విమర్శలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత వజీమ్‌ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన పోస్ట్‌ చేస్తూ ఇటీవల తన వైపు నుంచి చోటుచేసుకున్న కొన్ని ప్రకటనలు ఎవరినైనా బాధించి వుంటే క్షమించాలని కోరింది.

 జైరా వసీం:

జైరా వసీం:


కశ్మీర్‌ బాలిక జైరా వసీం... జమ్ము, కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీని కలవడంపై తీవ్ర వివాదం రేగింది. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పలువురు కశ్మీర్ యువకులు జైరాను రోల్‌మోడల్‌గా పొగుడుతూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. కొన్ని నెలల కిందట కశ్మీర్ లోయలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు పెట్టారు.

 రోల్‌మోడల్‌ను కాదని:

రోల్‌మోడల్‌ను కాదని:


దీంతో జైరా స్పందించింది. తనను రోల్‌మోడల్ అంటూ పోస్టులు చేయడం బాగాలేదని, తాను ఎవరికీ రోల్‌మోడల్‌ను కాదని తిరిగి పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో కశ్మీర్‌ యువత ఆమెపై దూషణలకు దిగారు. దంగల్ చిత్రం భారీ విజయం సాధించడంతో జైరాను కశ్మీర్‌ సీఎం మెహబూబా శనివారం పిలిచి అభినందించారు. కశ్మీర్‌ యువతపై దాడులు జరుగుతుంటే జైరా సీఎంను కలవడమేంటంటూ రాష్ట్ర యువత ఫేస్‌బుక్‌లో ఆమెపై దూషణలకు దిగారు. దీంతో జైరా వారి క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.

 బహిరంగంగా క్షమాపణలు:

బహిరంగంగా క్షమాపణలు:


‘‘నేను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నా. నేను ఇటీవల కొందరు వ్యక్తులను కలవడం చాలా మందిని బాధించింది. ఆరు నెలలుగా కశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. అయితే వారు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. నేను కొన్ని కొన్ని పరిస్థితులను నియంత్రించలేను.

నా వయస్సు 16 సంవత్సరాలు... నన్ను క్షమించండి, రాజకీయాల్లో నన్ను ఇరికించొద్దు

నా వయస్సు 16 సంవత్సరాలు... నన్ను క్షమించండి, రాజకీయాల్లో నన్ను ఇరికించొద్దు

నేను కేవలం 16 ఏళ్ల బాలికను అనే విషయాన్ని గుర్తించి దానికనుగుణంగా నా పట్ల వ్యవహరిస్తారని ఆశిస్తున్నా.'' అని ఆ పోస్టులో జైరా పేర్కొంది.కొందరు తనను కశ్మీర్‌ యువతకు రోల్‌మోడల్‌గా ప్రచారం చేసే ప్రయత్నం చేయడంపైనా జైరా స్పందించింది. తన అడుగు జాడల్లో ఎవరూ నడవాలని తాను కోరుకోవడం లేదని, తాను చేసిన ఏ పనికీ తాను గర్వంగా పొంగిపోవడం లేదని చెప్పింది.

 ప్రచారం చేయొద్దని :

ప్రచారం చేయొద్దని :


కాశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా తనను చూపించారని, తనను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదని, తాను 16 ఏళ్ల అమ్మాయిని అని, తన వయసును దృష్టిలో పెట్టుకొని తాను చేసిన వ్యాఖ్యలను చూడాలని జైరా కోరింది.ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, ప్రచారం చేయొద్దని సూచించారు.

 16 ఏళ్ల అమ్మాయితో :

16 ఏళ్ల అమ్మాయితో :


మరోవైపు ఈ వివాదం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. 16 ఏండ్ల యువతి జైరాకి ప్రమాదం పొంచి ఉన్నదని, వెంటనే భద్రత కల్పించాలని శాసనసభ్యులు డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ నజీర్ అహ్మద్ కల్పించుకొని సభ్యుల డిమాండ్ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జైరా పైన నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. 16 ఏళ్ల అమ్మాయితో బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు.

English summary
Dangal actress Zaira Wasim has issued a public apology via her Facebook account, after her meeting with Jammu and Kashmir chief minister Mehbooba Mufti triggered a backlash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu