»   » ట్రేడ్ అనలిస్టులకు షాక్.. దంగల్ కలెక్షన్ల జైత్రయాత్ర

ట్రేడ్ అనలిస్టులకు షాక్.. దంగల్ కలెక్షన్ల జైత్రయాత్ర

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

దంగల్ చిత్రం విడుదలై 5 వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించి నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.733.58 కోట్లను కొల్లగొట్టింది. దేశీయ మార్కెట్ లో గ్రాస్ రూ.532.56 కోట్లు (నికరం రూ.381.07 కోట్లు), విదేశీ మార్కెట్ లో రూ. 200.82 కోట్లు రాబట్టింది.

Dangal Collects Over 733 Crores Worldwide

పీకే వసూలు చేసిన రూ.798 కోట్ల కలెక్షన్లను అధిగమించి సరికొత్త రికార్డులను త్వరలోనే తిరుగరాసేందుకు దంగల్ దూసుకుపోతున్నది. రానున్న రోజుల్లో ఇదే ఊపు కొనసాగితే నికరంగా రూ.400 కోట్లను, స్థూలంగా రూ.800 కోట్ల కలెక్షన్ల రికార్డును అధిగమించే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

English summary
Dangal Movie Collecting Record level Collections in Domostic, Overseas Markets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu