»   » 200 కోట్లు కొట్టేస్తాడా...? అభిమానుల చూపంతా ఆ రికార్డ్ వైపే

200 కోట్లు కొట్టేస్తాడా...? అభిమానుల చూపంతా ఆ రికార్డ్ వైపే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్‌ఖాన్ తాజా చిత్రం 'దంగల్‌'.. బాక్సాఫీస్‌ వద్ద చెలరేగిపోతోంది. చేస్తున్న ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తూ వస్తున్న అమీర్‌.. ఈసారి నలుగురు అమ్మాయిల తండ్రిగా పహిల్వాన్ పాత్రలో కనిపించి, అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. విడుదలైన తొలి వారాంతంలోనే.. మూడు రోజుల్లో ఈ సినిమా దేశంలో రూ. 106.95 కోట్లను వసూలు చేయడం ట్రేడ్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం.. ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ ధోరణిలో నడిచే సినిమా కాకపోవడం.

బాలీవుడ్‌ చరిత్రలోనే ఒక రోజు వసూళ్లలో 'దంగల్‌' రెండో స్థానాన్ని సంపాదించడం విశేషం. ఇదివరకు షారుఖ్‌ఖాన్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్‌' తొలి రోజు రూ. 44.97 కోట్లను వసూలుచేసి కొత్త రికార్డును నెలకొల్పగా, విడుదలైన మూడో రోజున 'దంగల్‌' రూ. 42.35 కోట్లను వసూలుచేసి, ఆ సినిమాకు దగ్గరగా వచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత మరే సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరగటమే కాదు..వందకోట్లు.. నూటయాభై కోట్లు.. ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఐదు రోజుల కలెక్షన్లను చూస్తే.. బాక్సీఫీస్ దగ్గర అమీర్ స్టామినా ఏమిటో తెలిసేలా చేస్తుందని చెబుతున్నారు.

Dangal' worldwide box-office collection

స్వదేశంలోనే కాదు విదేశంలోనూ దంగల్ దూసుకెళుతోంది. . మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 16.92 శాతం, మూడో రోజు 21.63 శాతం అధికంగా వసూళ్లు రావడం గమనార్హం. గడచిన రెండేళ్ల కాలంలో చూసుకుంటే తొలి వారాంతం అత్యధిక వసూళ్లు 'దంగల్‌' పేరిట రికార్డయ్యాయి. ఇది రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన ఐదో అమీర్‌ సినిమా. ఇదివరకు 'గజిని', '3 ఇడియట్స్‌', 'ధూమ్‌ 3', 'పీకే' సినిమాలు కూడా రూ. వంద కోట్లను దాటాయి.

దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.29.78 కోట్లతో ఖాతా తెరిచిన దంగల్.. రెండో రోజు (శనివారం) రూ.34.82 కోట్లు.. మూడో రోజు (ఆదారం)రూ.42.35 కోట్లు.. నాలుగు రోజు(సోమవారం) రూ.25.48కోట్లు.. ఐదో రోజు (మంగళవారం) రూ.23.07 కోట్లతో మొత్తం రూ.155.53 కోట్లను కొల్లగొట్టినట్లుగా చెబుతున్నారు. ఇదంతా కూడా అప్పటికప్పుడు అందిన సమాచారంతో వేసిన లెక్కలుగా.. వాస్తవ లెక్కలు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మరో రోజులో న్యూఇయర్ బాష్ మొదలవుతున్న వేళ.. బాక్స్ ఫీస్ దగ్గర దంగల్ కలెక్షన్ల దుమ్ము రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఆదివారం ఒక్క రోజే రూ.42.35 కోట్ల‌తో సల్మాన్ ఖాన్ సుల్తాన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఈ క్ర‌మంలో త‌న మూవీ పీకే వ‌సూలు చేసిన రూ.700 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు దిశ‌గా దంగ‌ల్ ప‌రుగులు పెడుతోంది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ త‌న త‌ర్వాతి మూవీ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు.

English summary
A biopic on Indian wrestler and coach Mahavir Singh Phogat, 'Dangal' is just Rs 24 crore short of achieving the Rs 200-crore mark. It would be interesting to see if the film is able to do so on Thursday-Fry Day itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu