»   » ఇది వరల్డ్ రికార్డే మరి... ఆ హీరోకు వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్!

ఇది వరల్డ్ రికార్డే మరి... ఆ హీరోకు వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంచైజీ సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ సిరీస్ లో వచ్చే సినిమాలు దేనికదే ప్రత్యేకంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి సినిమాల్లో అవకాశం దక్కడమే అదృష్టంగా భావిస్తారు చాలా మంది స్టార్స్.

అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినా, వందల కోట్లు పారితోషికంగా ఇస్తానన్నా రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్. గత నాలుగు జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలైనప కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్రైఫాల్, స్పెక్టర్ చిత్రాల్లో డేనియల్ క్రేగ్ హీరోగా నటించాడు.

స్పెక్టర్ తర్వాత తాను జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల్లో నటించబోనని డేనియన్ క్రేగ్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్య చేసాడు కూడా...

అయితే జేమ్స్ బాండ్ తర్వాతి సినిమా సరైన హీరో దొరకక పోవడంతో అతన్నే మరోసారి తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించారు. సంవత్సరం క్రిందట 100 మిలియన్ అమెరికన్ డాలర్లను ఆఫర్ చేయగా దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించాడు.

అయితే ఈ సారి ఎలాగైనా ఒప్పించాలని భావిస్తున్న సోనీ సంస్థ నిర్మాతలు మరింత ఎక్కువ పారితోషికంతో అతన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ సారి ఏఖంగా 150 మిలియన్ డాలర్లు... మన కరెన్సీలో దాదాపు రూ. వెయ్యి కోట్లు ఆఫర్ ఆఫర్ చేసారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

కారణం ఏమిటి?

కారణం ఏమిటి?


జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించే హీరో అత్యంత కఠిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో చేయడం వల్ల నా ఒళ్లు హూనం అయింది. చాలా గాయాలయ్యాయని డేనియర్ క్రేగ్ తెలిపారు.

గత సినిమా

గత సినిమా


జేమ్స్ బాండ్ సిరీస్ లో వచ్చిన గత సినిమా ‘స్పెక్టర్' చిత్రాన్ని 250 మిలియన్ డాలర్స్ (1700 కోట్ల) బడ్జెట్ తో తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 880 మిలియన్ డాలర్లు(6 వేల కోట్లు) వసూలు చేసింది.

ఈ సారి..

ఈ సారి..


ఈ సారి ఒక్క హీరోకే రూ. 1000 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసారంటే సినిమా బడ్జెట్ రూ. 3 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా.

ఒప్పుకుంటాడా?

ఒప్పుకుంటాడా?


అయితే వెయ్యి కోట్ల ఆఫర్ ను డేనియల్ క్రేగ్ అంగీకరిస్తాడా? రిజక్ట్ చేస్తాడా? అనేది తేలాల్సి ఉంది.

2017లో...

2017లో...


2017లొ జేమ్స్ బాండ్ సిరీస్ తర్వాతి చిత్రానికి సంబంధించి ఓ క్లారిటీ రానుంది.

English summary
Hollywood superstar Daniel Craig, who has played the spy since 2005, has reportedly been offered $150 million to return as James Bond’ . But Craig has made no secret of his reluctance to step back into the famous tuxedo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu