»   » తెలుగు మార్కెట్ కోసం ధనుష్ పాట తిప్పలు

తెలుగు మార్కెట్ కోసం ధనుష్ పాట తిప్పలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పేరుకి రజనికాంత్ అల్లుడే, కాని తన స్వంత ప్రతిభతో పైకి వచ్చిన నటుడు ధనుష్. తమిళంలో స్టార్ గా ఉన్న అతను తెలుగు మార్కెట్ లో చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన రఘువరన్ ఎంటెక్ తప్ప ఏదీ ఆడలేదు. అయితే అతని దృష్టి ఇక్కడే పూర్తిగా ఉంది. అందుకేనేమో ఇక్కడ తాజాగా రిలీజ్ చేస్తున్న నవ మన్మధుడు చిత్రంని ఎలాగైనా జనాల్లోకి తీసుకువెళ్లాలనకుంటున్నాడు. అందులో భాగంగా ఓ రెండు పాటలు స్వయంగా తెలుగులో పాడుతున్నట్లు సమాచారం.

అతను గతంలో పాడిన కొలవరి డీ మెత్తం ప్రపంచాన్నిఊర్రూతలుగించింది. ఇదే ఉత్సాహం తో తెలుగులోను ఓరెండు పాడేయాలనుకుంటున్నాడు.. తమిళ సినిమా తంగమగన్ తెలుగులో నవ మన్మధుడు గా రాబోతోంది. ఈ సినిమాలోనే ఓరెండు పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని, తన గోంతుకు పని చెప్పాడు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ అందమైన మెలోడీసైనా మనసా మనసా...ఒడిని లాలీ ...పాటలను ధనూష్ చేత పాడించారు.

 Danush sings two songs for Tollywood

'వేలై ఇల్లా పట్టదారి (వీఐపీ)' హిట్‌ తర్వాత నటుడు ధనుష్‌, వేల్‌రాజ్‌ కాంబినేషన్‌లో సీక్వెల్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్‌ సరసన సమంత, ఎమీ జాక్సన్‌ నటిస్తున్నారు. కేఎస్‌ రవికుమార్‌, రాధిక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పళని సమీప ప్రాంతాల్లో సమంతకు సంబంధించిన సన్నివేశాలను పూర్తిచేశారు.

ధనుష్‌, ఎమీజాక్సన్‌ ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. తొలిభాగం తరహాలోనే దీన్ని కూడా కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిభాగంలోని 'వాట్‌ ఎ కరువాడ్‌..' తరహాలో ఇందులో కూడా ప్రత్యేక పాటకు అనిరుధ్‌ బాణీలు కట్టారని, చెన్నైలోని సముద్రతీరం వద్ద ఈ పాటను తెరకెక్కించినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

English summary
For upcoming Thangamagan Telugu version "Nava Manmadhudu", Danush has sung two songs in Telugu.
Please Wait while comments are loading...